రాజకుటుంబం నుంచి హ్యరీ, మేఘన్ వైదొలిగే తేదీ ఖరారు బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ, అయన భార్య మేఘన్ మార్కెల్లు రాజకుటుంబం నుంచి వైదొలిగేందుకు ముహూర్తం ఖరారైంది. మార్చి 31న అధికారికంగా తప్పుకోనున్నారు.
హ్యారీ దంపతుల స్వతంత్ర ఆర్థిక బాధ్యతలపై బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో జరిగిన తాజా చర్చల అనంతరం ఈ ప్రకటన వెలువడింది. రాజకుటుంబం నుంచి వైదొలిగినా అధికారిక సర్దుబాట్లు మాత్రం 12 నెలల తర్వాత జరగనున్నట్లు ప్యాలెస్ వర్గాలు తెలిపాయి.
అధికారిక నిష్క్రమణ అనంతరం..
రాజకుటుంబం నుంచి అధికారికంగా వైదొలిగిన తర్వాత హ్యారీ(35)కి మిలిటరీలో మేజర్, లెఫ్టినెంట్ కమాండర్ ర్యాంకులు కొనసాగుతాయి. అయితే వాటితో సంబంధమున్న బాధ్యతల్లో ఆయన అధికారికంగా కొనసాగేందుకు వీలుండదు. హ్యారీ, మేఘన్ దంపతులకు రాయల్ బిరుదులు ఉంటాయి. వాటిని అధికారికంగా వినియోగించుకునేందుకు అవకాశం లేదని బకింగ్‌హామ్ ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చూడండి:దిల్లీ కాకుంటే జైపుర్‌లో ట్రంప్ విమానం ల్యాండింగ్!