కాప్26 వాతావారణ సదస్సులో (Glasgow environmental conference) పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. గ్లాస్గోకు బయలుదేరారు. రెండు రోజుల పాటు అక్కడే పర్యటించనున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌తో (Glasgow meeting climate) ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
Cop26 Glasgow: గ్లాస్గోకు బయలుదేరిన ప్రధాని మోదీ - గ్లాస్గో సదస్సులో ప్రధాని మోదీ
కాప్26 వాతావారణ సదస్సులో (Glasgow environmental conference) పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. గ్లాస్గోకు బయలుదేరారు. నవంబర్ 1,2 తేదీల్లో అక్కడ పర్యటించనున్నారు.
కాప్26 సదస్సు
అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ)లో తమ భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరుచుకునే దిశగా గ్లాస్గో సదస్సు సందర్భంగా భారత్, బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకోనున్నాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ.. కొత్త గ్రీన్ గ్రిడ్స్‌ను ప్రారంభించనున్నాయి.
ఇదీ చదవండి:'కాప్26' సదస్సుతో భూతాపానికి పరిష్కారం దొరికేనా?