తెలంగాణ

telangana

ETV Bharat / international

విజృంభిస్తున్న 'డెల్టా' వైరస్- డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన - డెల్టా వేరియంట్​

ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్‌ పడగ విస్తరిస్తోంది. గత వారం రోజుల్లో నమోదైన కొత్త కేసుల్లో 75 శాతానికి పైగా డెల్టా రకమే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇండోనేషియా, బ్రిటన్‌లో కొత్త కేసుల్లో వృద్ధి గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది. మిగతా వేరియంట్‌లతో పోలిస్తే డెల్టా కేసుల్లో వైరస్‌ లోడ్‌ 12 వందల రెట్లు అధికంగా ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది

delta variant cases WHO, డెల్టా వేరియంట్​పై డబ్ల్యూహెచ్​ఓ
డెల్టా వేరియంట్ వ్యాప్తిపై డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన

By

Published : Jul 22, 2021, 1:40 PM IST

ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో డెల్టా వేరియంట్‌ కేసులే ఎక్కువ ఉండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. గత నాలుగు వారాల్లో నమోదైన కేసుల్లో 75 శాతానికి పైగా కేసులు డెల్టా వేరియంట్‌ అని పేర్కొంది. భారత్‌ సహా చైనా, రష్యా, ఇజ్రాయెల్, బ్రిటన్‌లో కొద్ది వారాలుగా కేసుల్లో పెరుగుదల వేగంగా నమోదవుతోందని డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు జులై 20న విడుదల చేసిన ఎపిడెమియోలాజికల్ అప్‌డేట్‌లో ప్రపంచవ్యాప్తంగా డెల్టా కేసుల పురోగతిని విశ్లేషించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌కు ప్రధాన కేంద్రాలుగా గుర్తించిన 6 రీజియన్‌లలో కొత్త కేసుల ఉద్ధృతి అధికంగా ఉన్నట్లు తెలిపింది. గత వారం రోజుల్లో ఇండోనేషియాలో కొత్తకే సుల్లో పెరుగుదల 44శాతానికి పైగా.. బ్రిటన్‌లో కొత్త కేసుల్లో వృద్ధి 41 శాతంగా నమోదైంది.

అయితే భారత్‌, బ్రెజిల్‌లో మాత్రం కొత్త కేసుల్లో వృద్ధి తగ్గుతున్నట్లు పేర్కొంది డబ్ల్యూహెచ్​ఓ. గత వారం రోజుల్లో భారత్‌లో కొత్త కేసుల్లో వృద్ధి 8 శాతానికి పడిపోగా.. బ్రెజిల్‌లో 14 శాతానికి తగ్గినట్లు తెలిపింది. వివిధ దేశాల నుంచి దాదాపు 24 లక్షల నమూనాలను విశ్లేషించినట్లు తెలిపిన డబ్ల్యూహెచ్​ఓ.. నెల రోజుల్లోనే చాలా దేశాల్లో నమోదైన కేసుల్లో 75 శాతం డెల్టా వేరియంట్‌ ఉన్నట్లు వెల్లడించింది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, చైనా, డెన్మార్క్, రష్యా ,బ్రిటన్‌లో మిగతా కరోనా వేరియంట్‌ల కంటే డెల్టా వేగంగా వ్యాపిస్తోందని తెలిపింది.

టీకాల సంగతేంటి?

టీకా తొలి డోసుకు డెల్టా వేరియంట్​ను ఎదుర్కొనే స్థాయిలో యాంటీబాడీలు ఏర్పడవని ఓ అధ్యయనం వెల్లడించింది. అయితే వ్యాక్సిన్లు మాత్రం సమర్థంగా పనిచేస్తాయని స్పష్టం చేసింది. ఫ్రాన్స్​కు చెందిన పాస్టర్​ ఇన్స్​టిట్యూట్​ చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. యాంటీబాడీల ప్రభావం తెలుసుకునేందుకు అల్ఫా, బీటా, డెల్టా వేరియంట్లపై పరిశోధనలు చేపట్టారు. ఇందుకోసం కరోనా నుంచి కోలుకున్నవారు, వ్యాక్సిన్​ తీసుకున్న వారు సహా కొవిడ్​ సోకిన వారిలో యాంటీబాడీల స్థాయిని పరిశీలించారు.

ఇదీ చదవండి :'డబ్ల్యూహెచ్​ఓ ప్రకటనతో షాక్​ అయ్యాం'

ABOUT THE AUTHOR

...view details