తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫ్రాన్స్​లో మళ్లీ లాక్​డౌన్- ప్రకటించిన మేక్రాన్ - కొవిడ్​ ఫ్రాన్స్​

రెండో దఫా కరోనా ఉద్ధృతితో యూరప్‌దేశాలు వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్​ వ్యాప్తిని కట్టడి చేసేందుకు.. మళ్లీ నెలరోజుల పాటు లాక్​ డౌన్​ విధించింది ఫ్రాన్స్​. అయితే.. పాఠశాలలు మాత్రం తెరిచే ఉంటాయని స్పష్టం చేసింది.

President Macron announces new national lockdown in France from Friday
ఈ శుక్రవారం నుంచి లాక్​డౌన్​లోకి ఫ్రాన్స్​

By

Published : Oct 29, 2020, 5:31 AM IST

Updated : Oct 29, 2020, 7:08 AM IST

కరోనాను కట్టడి చేసేందుకు ఫ్రాన్స్​ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి నెలరోజుల పాటు దేశ వ్యాప్త లాక్​డౌన్​ను విధిస్తున్నట్లు ప్రకటించింది.

బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్​ మేక్రాన్​ ప్రసంగించారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు బాగానే ఉన్నప్పటికీ అవి సరిపోవని అభిప్రాయపడ్డారు. ఇంకా కఠినమైన పద్ధతులు పాటించాల్సి ఉందని చెప్పారు.

"కరోనాతో సహజీవనం చేయాలని మేము ఎప్పడూ చెబుతూనే ఉన్నాం. వైరస్​ కట్టడికి సాధ్యమైనంత మేర కృషి చేశాం. కానీ, మనం మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. అందుకే దేశ వ్యాప్త లాక్​డౌన్​ను అమలు చేస్తున్నాం. కొవిడ్​ కట్టడికి సమష్టిగా కృషి చేయాలి. అయితే.. ఈ లాక్​డౌన్​లోనూ పాఠశాలలు తెరిచే ఉంటాయి."

-- ఇమ్మాన్యుయేల్​ మేక్రాన్​, ఫ్రాన్స్​ అధ్యక్షుడు

ఫ్రాన్స్​లో వైరస్​ విజృంభిస్తోంది. ఇదే ఒరవడి కొనసాగితే.. నవంబర్​ నెల మధ్య నాటికి అన్ని ఆసుపత్రుల్లోనూ కొవిడ్ రోగులే ఉంటారని ఇమ్మాన్యుయేల్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:కరోనా బాధితుల్లో విటమిన్-డి లోపం!

Last Updated : Oct 29, 2020, 7:08 AM IST

ABOUT THE AUTHOR

...view details