పోర్చుగల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 29మంది ప్రాణాలు కోల్పోయారు. మదీరా దీవిలో పర్యటకుల బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. మృతుల్లో 17 మంది మహిళలు ఉన్నారు. మరో 28 మంది గాయపడ్డారు.
ఘటనా స్థలానికి వైద్య బృందాలను పంపించారు అధికారులు. ప్రయాణికుల్లో జర్మనీ దేశస్థులు అధిక సంఖ్యలో ఉన్నారని తెలిపారు.