కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచదేశాలన్నీ ఆశగా ఎదురుచూస్తున్న వేళ బ్రిటీష్ ఫార్మసీ సంస్థ ఆస్ట్రాజెనెకా తీపికబురు అందించింది. కరోనా కట్టడిలో తమ వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తోందని ప్రకటించింది.
70% సమర్థంగా ఆస్ట్రాజెనెకా టీకా - ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ తాజా వార్తలు
శుభవార్త: 90% సమర్థవంతంగా ఆస్ట్రాజెనకా టీకా
13:19 November 23
క్లినికల్ ట్రయల్స్ ఆఖరిదశ ప్రయోగాల్లో కరోనా కట్టడిలో వ్యాక్సిన్ అత్యంత సమర్థంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైందని తెలిపింది ఆస్ట్రాజెనెకా. యూకే, బ్రెజిల్‌లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ మధ్యంతర ఫలితాలను విడుదల చేసింది.
- తమ వ్యాక్సిన్ 70 శాతం వరకు కరోనా వైరస్‌ను అడ్డుకోగలుగుతున్నట్లు తేలిందని ఆస్ట్రాజెనెకా వెల్లడించింది.
- ఒక నెల వ్యవధిలో రెండు డోసులు తీసుకున్న వారిలో వ్యాక్సిన్ 62 శాతం వరకు కొవిడ్‌ను అడ్డుకుందని పేర్కొంది.
- ఒక నెల వ్యవధిలో ఒక పూర్తి డోస్, మరో సగం డోస్ తీసుకున్న వాళ్లలో వ్యాధి నుంచి రక్షణ 90 శాతంగా ఉన్నట్లు తెలిపింది.
- మొత్తంగా తమ వ్యాక్సిన్ 70 శాతం వరకు కరోనాను నియంత్రించగలుగుతున్నట్లు ఆస్ట్రాజెనెకా వెల్లడించింది.
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి ఆస్ట్రాజెనెకా కరోనా టీకా అభివృద్ధి చేస్తోంది.
ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది.
Last Updated : Nov 23, 2020, 1:50 PM IST