తెలంగాణ

telangana

ETV Bharat / international

నీటిలో దూకి బాలికలను కాపాడిన దేశాధ్యక్షుడు - Portugal President today news

పోర్చుగల్ అధ్యక్షుడు రెబెలో డిసౌజా మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. తన నివాసానికి సమీపంలోని బీచ్​ వద్ద నీటిలో మునిగిపోతున్న ఇద్దరు బాలికలను రక్షించారు. స్వయంగా నీటిలోకి దూకి రెస్క్యూ టీమ్​కు సహకరించారు.

Portugal President helps rescue of two young girls
రిస్క్​చేసి ఇద్దరు యువతులను కాపాడిన ఆ దేశ ఆధ్యక్షుడు

By

Published : Aug 18, 2020, 5:04 AM IST

పోర్చుగల్​ అధ్యక్షుడు రెబెలో డిసౌజా ప్రాణాలకు తెగించి ఇద్దరు బాలికలను రక్షించారు. డిసౌజా నివాసానికి సమీపంలోని బీచ్​ వద్ద ఇద్దరు బాలికలు నీటిలో పడిపోయారు. మునిగిపోతున్న వారిని కాపాడేందుకు నీటిలోకి దూకి రెస్క్యూ టీమ్​కు సహకరించారు.

నీటిలో దూకి బాలికలను రక్షించిన ఆధ్యక్షుడు
అధ్యక్షుడి హోదాలో ఉన్నా డిసౌజా అత్యంత సాధారణంగా వ్యవహరిస్తారు. స్థానికంగా ప్రజలతో మాట్లాడుతూ కనిపిస్తుంటారు. ఇటీవల ఓ స్టోర్​లో మాస్కు వేసుకుని క్యూలో నిలుచున్న డిసౌజా ఫొటో వైరల్​గా మారింది. డిసౌజాకు ఈతలో మంచి ప్రావీణ్యం ఉంది. తరచూ తన ఇంటి సమీపంలోని బీచ్​లో సరదాగా గడుపుతారు.

ABOUT THE AUTHOR

...view details