తెలంగాణ

telangana

By

Published : Jan 14, 2021, 8:07 PM IST

ETV Bharat / international

కరోనా టీకా తొలి డోసు తీసుకున్న పోప్​

పోప్ ఫ్రాన్సిస్ గురువారం.. కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు. ఈ వారం వ్యాక్సినేషన్​ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో పోప్​ మొదటి టీకా వేసుకోవడం విశేషం.

Pope Vaccine
కరోనా టీకా మొదటి డోసు వేసుకున్న పోప్

పోప్​ ఫ్రాన్సిస్ గురువారం.. కరోనా టీకా మొదటి డోసును తీసుకున్నట్లు వాటికన్ సిటీ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు మాత్రం బయటకు విడుదల చేయలేదు.

"ప్రతీ ఒక్కరూ తప్పకుండా టీకా వేసుకోవాలి. టీకా వేసుకుంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాదు.. ఇతరులను కూడా రక్షించినవారవుతారు." అని టీకా వేసుకున్న అనంతరం పోప్​​ అన్నారు.

ఈ వారం వాటికన్​ సిటీలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రముఖ ఔషధ తయారీ సంస్థ 'ఫైజర్' ఈ దేశానికి కరోనా టీకాలు అందించింది.

ఇదీ చదవండి:పోప్​కు వచ్చేవారం టీకా- నెతన్యాహుకు రెండో డోసు

ABOUT THE AUTHOR

...view details