తెలంగాణ

telangana

ETV Bharat / international

'అసాంజే బెయిలు​ నిబంధనల్ని ఉల్లంఘించారు' - west minister

2012లో మంజూరు చేసిన బెయిల్ నిబంధనలను వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే ఉల్లంఘించారని పేర్కొంది బ్రిటన్​లోని వెస్ట్​మినిస్టర్​ మేజిస్ట్రేట్​ కోర్టు. ఆయనను పోలీసు కస్టడీకి అప్పగించింది. తదుపరి విచారణను మే2కు వాయిదా వేసింది.

'అసాంజె బెయిల్​ నిబంధనల్ని ఉల్లంఘించారు'

By

Published : Apr 12, 2019, 7:00 AM IST

బెయిలు నిబంధనల ఉల్లంఘన కేసులో వికీలీక్స్​ వ్యవస్థాపకుడు అసాంజేను దోషిగా తేల్చింది బ్రిటన్​లోని వెస్ట్​మినిస్టర్​ మేజిస్ట్రేట్​ కోర్టు. ఈక్వెడార్​ దౌత్య కార్యాలయం రక్షణను విరమించుకోగానే అసాంజేపై విచారణను ప్రారంభించింది. 2012లో మంజూరు చేసిన బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని స్పష్టం చేసింది. ఆయనను కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో అసాంజేకు 12నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. మే 2న తదుపరి విచారణ జరగనుంది.

కంప్యూటర్ హ్యాకింగ్​పై...

అసాంజేపై కంప్యూటర్ హ్యాకింగ్​ ఆరోపణలు చేస్తూ తమకు అప్పగించాలన్న అమెరికా వినతిపై మే2న విచారణ చేపట్టనుంది బ్రిటన్ కోర్టు. అమెరికా ఆర్మీ నిఘామాజీ విశ్లేషకురాలు చెల్సియా మానింగ్​తో కలసి మార్చి 2010లో రక్షణ విభాగానికి చెందిన కంప్యూటర్ల పాస్​వర్డ్​ను అసాంజే హ్యాక్​ చేశారని ఆరోపిస్తోంది అమెరికా. అందులో ఉన్న సమాచారాన్ని తస్కరించి విలువైన సమాచారాన్ని బయటపెట్టారని అభియోగాలను మోపుతోంది.

ఇదీ చూడండి: వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే అరెస్టు

ABOUT THE AUTHOR

...view details