పోప్ ఫ్రాన్సిస్.. స్వలింగ సంపర్క పౌర సమాజాలను సమర్థించారు. 'పోప్' హోదాలో ఆయన ఈ విధంగా వెల్లడించడం ఇదే తొలిసారి. 'రోమ్ ఫిల్మ్ ఫెస్టివల్'లో బుధవారం 'ఫ్రాన్సెస్కో' చిత్రాన్ని ప్రదర్శించిన సందర్భంగా ఇచ్చిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ''స్వలింగ సంపర్కులకు కుటుంబంతో కలిసి జీవించే హక్కు ఉంది. వారు దేవుడి బిడ్డలు. అందరితో పాటు వారినీ సమానంగా చూడటం అవసరం'' అని పోప్ తెలిపారు.
స్వలింగ సంపర్క పౌర సమాజాలను సమర్థించిన పోప్! - రోమ్ ఫిల్మ్ ఫెస్టివల్
పోప్ హోదాలో తొలిసారిగా.. స్వలింగ సంపర్క పౌర సమాజాలను సమర్థించారు పోప్ ఫ్రాన్సిస్. స్వలింగ సంపర్కులకు కుటుంబంతో కలిసి జీవించే హక్కు ఉందని.. వారిని అందరితో సమానంగా చూడటం అవసరమని తెలిపారు.
స్వలింగ సంపర్క పౌర సమాజాలను సమర్థించిన పోప్!
స్వలింగ సంపర్క పౌర సమాజాలను సమర్థిస్తూ పోప్ చేసిన వ్యాఖ్యలు.. ఇలాంటి సంప్రదాయాన్ని వ్యతిరేకించిన చర్చిలకు గొప్ప సందేశాన్నిస్తాయని పలువురు క్రైస్తవ మత పెద్దలు అభిప్రాయపడ్డారు. పోప్ ఎక్కువగా శ్రద్ధ చూపే పర్యావరణం, పేదరికం, వలసలు, జాతి, సంపదపరమైన వివక్ష లాంటి అంశాల ఆధారంగా ఫ్రాన్సెస్కో చిత్రాన్ని చిత్రీకరించారు.
ఇదీ చూడండి:కోపమొచ్చి.. ఇంటర్వ్యూ మధ్యలోంచి వెళ్లిపోయిన ట్రంప్