అధ్యక్ష ఎన్నికలు ముగిసిన గంటల వ్యవధిలోనే ఐరోపా దేశం బెలారస్‌లో హింస ప్రజ్వరిల్లింది. ప్రస్తుత అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషింకో... అధికార దుర్వినియోగానికి పాల్పడి మరోమారు ఎన్నికయ్యేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ నిరసనకారులు ఆందోళనకు దిగారు.
అధ్యక్ష ఎన్నికలపై దేశవ్యాప్త నిరసనలు - protests in Belarus news
బెలారస్‌లో నిరసన జ్వాలలు చెలరేగాయి. అధ్యక్ష ఎన్నికలు ముగిసిన గంటల వ్యవధిలోనే ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. ప్రస్తుత అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషింకో అధికార దుర్వినియోగానికి పాల్పడి మరోమారు ఎన్నికయ్యేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.
![అధ్యక్ష ఎన్నికలపై దేశవ్యాప్త నిరసనలు Police, protesters clash after Belarus presidential vote](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8361532-thumbnail-3x2-belarus.jpg)
అధ్యక్ష ఎన్నికలపై దేశవ్యాప్త నిరసనలు
రాజధాని మిన్‌స్క్ సహా బ్రెస్ట్ నగరంలో ఒక్కసారిగా ఆందోళనలు మిన్నంటాయి. ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పలు చోట్ల పోలీసులతో ఘర్షణకు దిగారు. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు వాటర్ కేనన్‌లు, బాష్ప వాయువును ప్రయోగించారు.
Last Updated : Aug 10, 2020, 11:55 AM IST