మహమ్మారి కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఎక్కడికక్కడ కేసులు పెరిగిపోతున్నాయి. మరణాలూ అదే స్థాయిలో ఉన్నాయి. పోలాండ్లో ఓ మంత్రికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ముందు జాగ్రత్తగా అక్కడి ప్రభుత్వ యంత్రాంగమంతా నిర్బంధంలో ఉంది.
ఈ నెల 10న పోలాండ్ సర్కార్ కీలక సమావేశం నిర్వహించింది. మంత్రులు సహా.. ప్రభుత్వ సిబ్బంది అంతా ఈ భేటీకి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఓ మంత్రికి వైరస్ సోకినట్లు తేలగా.. అందరినీ నిర్బంధంలో ఉంచి పరిశీలిస్తున్నారు.