జీ-20 సదస్సు(Modi G20 summit) కోసం ఇటలీ(Modi visit to Italy) వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడి పర్యటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఆదివారం.. జీ-20 సదస్సు రెండో రోజులో భాగంగా రోమ్‌లోని ప్రసిద్ధ ట్రెవీ ఫౌంటెయిన్‌కు(Trevi fountain) వెళ్లారు.
ఇతర దేశాధినేతలు, అక్కడి అధికారులతో మోదీ కాసేపు కలియతిరిగారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్‌తో మోదీ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు.
నీటిలోకి నాణెం..
ఆ తర్వాత వెనుకకు తిరిగి నీటిలోకి నాణెం (Trevi fountain coins) విసిరారు మోదీ. అలా భుజం మీదుగా నీళ్లలో నాణెం విసిరితే మళ్లీ రోమ్ వెళ్తారని ప్రజల నమ్మకం (Trevi fountain facts). భారత ప్రధాని కూడా ఇతర నేతలతో కలిసి ఇదే పని చేశారు.