తెలంగాణ

telangana

ETV Bharat / international

'ప్రవాస భారతీయులతో సంభాషణ గొప్పగా జరిగింది' - ప్రధాని మోదీ

ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రవాస భారతీయుల బృందాన్ని కలిశారు. వారితో సంభాషణలు గొప్పగా జరిగాయని ట్వీట్​ చేశారు.

pm modi italy visit
మోదీ

By

Published : Oct 30, 2021, 2:10 PM IST

ఇటలీ పర్యటనలో భాగంగా రోమ్​లోని ప్రవాస భారతీయ బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిశారు. అనంతరం.. వారితో సంభాషణ గొప్పగా జరిగిందని ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

ప్రవాస భారతీయులతో మోదీ
ప్రవాస భారతీయులతో మోదీ

"రోమ్​లో ప్రవాస భారతీయులతో చర్చించాను. దేశంతో ఎనలేని బంధాన్ని ఏర్పరచుకున్న వారితో సంభాషణలు గొప్పగా జరిగాయి. వివిధ అంశాలపై వారి ఆలోచనలు వినడం చాలా అద్భుతంగా అనిపించింది."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ప్రధాని మోదీతో భేటీపై సనాతన్​ ధర్మ సంఘ అధ్యక్షురాలు స్వామిని హంసనంద గిరి స్పందించారు. 'ఇటలీలో హిందువుగా జీవించడం కష్టం. ఇక్కడ హిందువులు మైనారిటీలు. కానీ ఇటలీలో మోదీని కలవడం చాలా గౌరవంగా ఉంది. ఆయనతో చర్చ చలించివేసింది.' అని తెలిపారు.

ప్రవాస భారతీయులతో మోదీ
ప్రవాస భారతీయులతో మోదీ
ప్రవాస భారతీయులతో మోదీ

జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం.. ఇటలీకి వెళ్లారు. శని, ఆదివారాల్లో జీ20 సదస్సు జరగనుంది.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details