తెలంగాణ

telangana

ETV Bharat / international

జర్మనీ ఛాన్సలర్​తో మోదీ భేటీ.. ద్వైపాక్షిక అంశాలపై చర్చ - ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌ మోదీ భేటీ

జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృత చర్చలు జరిపారు. మరోవైపు ఇండోనేసియా ప్రధాని జోకో విడోడోతోనూ మోదీ భేటీ అయ్యారు.

Modi
మోదీ

By

Published : Oct 31, 2021, 10:24 PM IST

జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో సమావేశమయ్యారు. ఈ మేరకు ట్వీట్ చేసిన విదేశాంగ శాఖ.. భారత్-జర్మనీల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు విస్తృత చర్చలు జరిపారని పేర్కొంది.

"ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించనున్నట్లు దేశాధినేతలు ఉద్ఘాటించారు. ఈ రెండు దేశాల బలమైన స్నేహం ప్రపంచ శ్రేయస్సుకు శుభ సూచకం"

-విదేశాంగ శాఖ ట్వీట్‌

ఈ సమావేశంలో మోదీ వెంట విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా సహా.. ఇతర అధికారులు ఉన్నారు.

జోకో విడోడోతోనూ..

జీ20 సదస్సులో భాగంగా ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్ మహమ్మారి సమయంలో తమ దేశానికి ఫార్మా ఉత్పత్తుల సరఫరాలో భారత ప్రభుత్వ సహకారాన్ని జోకో విడోడో కొనియాడారు.

జోకో విడోడోతో మోదీ
ఇండోనేసియా ప్రధానితో సమావేశం

చివరిగా ఏప్రిల్ 2020లో ఇరు దేశాధినేతలు టెలిఫోన్​ సంభాషణ జరిపారు.

జీ20 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ సహా పలువురు ప్రపంచ నేతలతోనూ ప్రధాని మోదీ సంభాషించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details