బ్రిటన్‌లోని గ్లాస్గోకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో అక్కడి అధికారులు స్వాగతం పలుకగా.. అక్కడ నుంచి హోటల్ చేరుకున్న మోదీకి బ్యాండుతో ఘనంగా ఆహ్వానించారు అక్కడి భారత సంతతి ప్రజలు. 'మోదీ హై భారత్ కా జహ్నా(భారత్‌కు మోదీ ఆభరణం)' అంటూ నినాదాలు చేశారు. దీంతో హోటల్లో సందడి నెలకొంది. ఈ క్రమంలో మోదీ వారితో కాసేపు మోదీ ముచ్చటించారు.
కాప్26 వాతావారణ సదస్సులో (Glasgow environmental conference) పాల్గొనేందుకు ప్రధాని.. గ్లాస్గో వెళ్లారు. రెండు రోజుల పాటు అక్కడే పర్యటించనున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌తో (Glasgow meeting climate) ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.