తెలంగాణ

telangana

ETV Bharat / international

రోజూ వ్యాయామం చేయండి.. ఆయుష్షు పెంచుకోండి - శారీరక శ్రమ వల్ ఉపయోగాలు

శారీరక వ్యాయామం ద్వారా కేవలం బరువు అదుపులో ఉండటమే కాకుండా.. మరిన్ని ఉపయోగాలూ ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండటం సహా.. ఆయుష్షూ పెంచుకోవచ్చు. నిత్యం వ్యాయామం చేయడం వల్ల ఏటా సుమారు 40 లక్షల మంది అనేక వ్యాధుల ద్వారా వచ్చే మరణం నుంచి తప్పించుకుంటున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

Physical activity prevents four million early deaths worldwide annually: Study
నిత్య వ్యాయామంతో పెరుగుతోన్న ఆయుఃప్రమాణం

By

Published : Jun 19, 2020, 7:44 AM IST

వ్యాయామం అంటే తేలిగ్గా తీసుకొనే వారు కొందరైతే.. సమయాభావం వల్ల అసలు పట్టించుకోని వారు మరికొందరు. అయితే శారీరక శ్రమ వల్ల ఆయుష్షు పెంచుకోవచ్చని వెల్లడిస్తున్నాయి తాజా అధ్యయనాలు. నిరంతరం వ్యాయామం చేసేవారిలో ఏటా 39 లక్షల మంది సత్ఫలితాలు పొందుతున్నారని వెల్లడిస్తున్నాయి పరిశోధనలు.

బ్రిటన్​లోని కేంబ్రిడ్జ్​, ఎడిన్​బురా​ విశ్వవిద్యాలయాల పరిశోధకులు.. 168 దేశాల్లో సమాచారాన్ని పరిశీలించి ఈ అధ్యయన ఫలితాలు వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన వ్యాయామ పద్ధతులపై వారు అధ్యయనం చేశారు. దీని కోసం 75 నిమిషాల పాటు తీవ్రంగానూ, రెండున్నర గంటలపాటు మధ్యస్థాయిలోనూ వ్యాయామం చేసే వారిని.. అదే విధంగా రెండు రకాలుగా వ్యాయామం చేసేవారిని విస్తృతంగా పరిశీలించారు శాస్త్రవేత్తలు.

ఆయుః ప్రమాణంలో వ్యత్యాసాలు..

వ్యాయామం చేసేవారి జనాభా నిష్పత్తి ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉందని పరిశోధనల్లో తేలింది. ఈ నిష్పత్తి కువైట్​లో 33 శాతం​, బ్రిటన్​లో 64 శాతం​, ముజాంబిక్​లో 94 శాతంగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ అధ్యయనాల ప్రకారం.. వ్యాయామం చేయనివారిని, చేసేవారితో పోల్చగా.. ఇరువురి ఆయుః ప్రమాణంలో తేడాలున్నట్లు స్పష్టమైంది. శారీరకంగా శ్రమించిన వారిలో 39 లక్షల మంది ఆయుష్షు పెరగ్గా.. వారిలో పురుషులు 16 శాతం, మహిళలు 14 శాతం మంది ఉన్నారు.

నిత్యం వ్యాయామం చేస్తూ పేద దేశాల్లో 18 శాతం, ధనిక దేశాల్లో 14 శాతం మంది తమ ఆయుః ప్రమాణాన్ని పెంచుకుంటున్నట్లు అధ్యయనాలు ప్రకటించాయి.

వ్యాయామానికి ఎంతటి ప్రాధాన్యం ఇవ్వాలో ఈ అధ్యయనాల ద్వారా స్పష్టమవుతోందని పరిశోధకులు అంటున్నారు. కాబట్టి ఎంత శారీరకంగా శ్రమిస్తే మన ఆయుష్షు అంత పెరుగుతుందని చెబుతున్నారు.

ఇదీ చదవండి:ఫ్లషింగ్ టాయిలెట్స్‌తోనూ వైరస్‌ ముప్పు!

ABOUT THE AUTHOR

...view details