తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫోన్​ వాడకం వ్యసనమైతే ఒత్తిడి తప్పదు!

డిజిటల్​ టెక్నాలజీని ఎక్కువగా వినియోగించడం కారణంగా విద్యార్థులు చదువులో తక్కువ శ్రద్ధ కనబరుస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్లను అధికంగా వాడితే మరింత ప్రభావం ఉంటుందని వెల్లడైంది.

Phone addiction linked to loneliness, may make students anxious about tests: Study
ఫోన్​ అలవాటు వ్యసనమైతే ఒత్తిడి తప్పదు!

By

Published : Jan 19, 2020, 3:13 PM IST

డిజిటల్​ సాంకేతికతను ఎక్కువగా ఉపయోగిస్తున్న విద్యార్థులు.. చదువుల్లో తక్కువ శ్రద్ద కనబరుస్తారని ఓ అధ్యయనంలో తేలింది. పరీక్షలంటే వీరు తీవ్ర ఒత్తిడికి లోనవుతారని.. ఒంటరిగా ఉంటూ ఫోన్లతోనే సమయం గడిపే వారిపై ఈ ప్రభావం ఇంకా ఎక్కవగా ఉంటుందని అధ్యయనం స్పష్టం చేసింది.

బ్రిటన్​లో ఆరోగ్య సంబంధిత డిగ్రీ కోర్సుల్లో చేరిన 285 మంది విద్యార్థులపై ఈ అధ్యయనం చేశారు. డిజిటల్​ టెక్నాలజీ వినియోగ విధానాలు, వారి ప్రవర్తన, ఒంటరితనం, చదువులో నైపుణ్యాలు వంటి అంశాలపై అధ్యయనం చేసి విశ్లేషించారు. బ్రిటన్​లోని స్వాన్సీ విశ్వవిద్యాలయంతో సహా కొంత మంది అధ్యయనకర్తలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వచ్చిన ఫలితాలను జర్నల్​ ఆఫ్​​ అసోసియేటెడ్​ కంప్యూటర్​ లెర్నింగ్​ మేగజీన్​లో ప్రచురించారు. అంతర్జాల​ వ్యసనం.. చదువుపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఈ పరిశోధనలో తేలింది.

నాలుగు గంటలు ఆన్​లైన్​లోనే

ప్రతి నలుగురిలో ఒక విద్యార్థి రోజుకు సుమారు 4గంటలపాటు ఆన్​లైన్​లో గడుపుతున్నాడు. మిగిలిన వారు ఒకటి నుంచి 3 గంటల పాటు అంతర్జాలం కోసం సమయాన్ని వెచ్చిస్తున్నారు. వీరిలో 40 శాతం మంది సామాజిక మాధ్యమాల కోసం ఇంటర్నెట్​ వినియోగిస్తే..30 శాతం మంది కావాల్సిన సమాచారాన్ని తెలుసుకునేందుకు వాడుతున్నారు.

అంతర్జాల వ్యసనం కారణంగా నియంత్రణ కోల్పోవడం, ప్రణాళిక రూపకల్పన వంటి సామర్థ్యాలు బలహీనపడతాయని.. వీటిలో సరైన సామర్థ్యం లేకపోతే చదవడం కష్టతరం అవుతుందని అధ్యయనకర్తలు వెల్లడించారు.

విద్యావ్యవస్థలో డిజిటలైజేషన్​ను కొనసాగించే ముందు.. 'నిజంగా ఇది మనకు మంచి ఫలితాలను తీసుకురానుందా?' అని ఒక్కసారి ఆలోచించుకోవాలని నిపుణులు సూచించారు. ఈ ప్రణాళిక కొన్ని అవకాశాలను అందించినా కానీ.. అసలు అంచనా వేయలేని నష్టాలనూ తీసుకొస్తుందని హెచ్చరించారు.

ఇదీ చూడండి: ప్లాస్టిక్​పై పోరు కోసం బాహుబలి 'తాబేలు'!

ABOUT THE AUTHOR

...view details