ఫైజర్, ఆస్ట్రాజెనెకా కరోనా టీకాలు 70 ఏళ్లు దాటిన వారిపై ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ కరోనా టీకాలు వయో వృద్ధుల్లో తీవ్రమైన కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గిస్తున్నాయని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ అధ్యయనం తెలిపింది.
70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల్లో కరోనా వైరస్ వ్యాప్తిని పరిశోధకులు అధ్యయనం చేశారు. లండన్లో కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని వీరు పరీక్షించారు. 70 ఏళ్లు దాటిన వారిలో ఫైజర్, ఆస్ట్రాజెనెకా కరోనా టీకాలు 80 శాతం కంటే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేశాయని ఈ నివేదిక వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 3-4 వారాల్లో ఈ మార్పు కనిపిస్తోందని తెలిపింది.