తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫైజర్‌ రెండు డోసులతో పవర్​'ఫుల్' ఇమ్యూనిటీ! - ఫైజర్​ టీకా సమర్థత

రెండు డోసుల ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకుంటే పలు రకాల కరోనా వేరియంట్లపై ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. వారిలో వైరస్‌లకు వ్యతిరేకంగా శక్తిమంతమైన రోగనిరోధక స్పందన కనిపిస్తున్నట్టు తేలింది.

Pfizer
ఫైజర్​

By

Published : Jul 6, 2021, 9:48 AM IST

రెండు డోసుల ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో.. వివిధ రకాల కరోనా వైరస్‌లకు వ్యతిరేకంగా శక్తిమంతమైన రోగనిరోధక స్పందన కనిపిస్తున్నట్టు తాజా పరిశోధనలో తేలింది. టుక్రూ, హెల్సింకీ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు దీన్ని చేపట్టారు. ఫైజర్‌ టీకా తీసుకున్న ఫిన్లాండ్‌లోని 180 మంది ఆరోగ్య కార్యకర్తల్లో ఎలాంటి రోగనిరోధక ప్రతిస్పందనలు కలిగాయన్నది నిశితంగా గమనిస్తూ వచ్చారు. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారిలో వచ్చిన రోగనిరోధక ప్రతిస్పందనలతో వీటిని పోల్చారు. ఈ వివరాలను 'నేచర్‌ కమ్యూనికేషన్స్‌' పత్రిక అందించింది.

"చైనాలోని వుహాన్‌లో తొలుత వెలుగుచూసిన కరోనా వైరస్‌పై ఈ టీకా ఎంత శక్తిమంతంగా పనిచేస్తుందో... బ్రిటన్‌లో గుర్తించిన ఆల్ఫా రకాన్నీ అంతే బలంగా ఎదుర్కొంటోంది. దక్షిణాఫ్రికాలో తలెత్తిన బీటా రకం వైరస్‌కు వ్యతిరేకంగా కొంత తక్కువే అయినా, మంచి స్థాయిలో యాంటీబాడీల ఉత్పత్తికి ఫైజర్‌ వ్యాక్సిన్‌ దోహదపడుతున్నట్టు గుర్తించాం. వయసుతో సంబంధం లేకుండా రెండు డోసుల టీకా తీసుకున్న స్త్రీ, పురుషులందరిలో... కరోనాకు వ్యతిరేకంగా అద్భుతమైన రోగనిరోధకశక్తి లభిస్తోంది" అని పరిశోధనకర్త ఇల్కా జుల్కునెన్‌ తెలిపారు.

ఇదీ చూడండి:జులై 19 నుంచి కరోనా ఆంక్షలు ఖతం!

ABOUT THE AUTHOR

...view details