తెలంగాణ

telangana

ETV Bharat / international

మిన్నంటిన ఎల్లో వెస్ట్-బలగాలు అప్రమత్తం - నోటర్​డామ్​

ఫ్రాన్స్​లో ఎల్లో వెస్ట్​ నిరసనలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఇటీవల అగ్నిప్రమాదానికి గురైన ప్రఖ్యాత నోటర్​డామ్​ చర్చి పునర్నిర్మాణంపై ప్రభుత్వ అమితాసక్తి చూపటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఎల్లోవెస్ట్​ నిరసనకారులు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 70 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఎల్లోవెస్ట్ నిరసనలు ఉద్రిక్తతలు

By

Published : Apr 21, 2019, 7:34 AM IST

Updated : Apr 21, 2019, 8:42 AM IST

ఎల్లోవెస్ట్ నిరసనలు ఉద్రిక్తతలు

ఫ్రాన్స్​లో పన్ను పెంపునకు వ్యతిరేకంగా, ఆర్థిక సంస్కరణల కోసం ఎంతో కాలంగా జరుగుతున్న ఎల్లోవెస్ట్ నిరసనలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. అగ్నిప్రమాదానికి గురైన ప్రఖ్యాత నోటర్​డామ్​ చర్చి పునర్నిర్మాణంపై ప్రభుత్వ అమితాసక్తి చూపటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు నిరసనకారులు. అంతకు మించి దేశంలో సమస్యలే లేవా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఉద్రిక్తలు పెరిగే అవకాశం ఉండటం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశవ్యాప్తంగా 60వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు 70 మంది ఎల్లోవెస్ట్​ నిరసనకారులను అరెస్టు చేశారు.

200 మంది ఉన్న ఓ బృందం ప్రధాని నివాసం వైపు పరుగులు తీయగా.. పోలీసులు అడ్డుకున్నారు. మరికొంత మంది నోటర్​ డామ్​ చర్చి వైపు వెళ్లేందుకూ ప్రయత్నించారు.

ఇదీ చూడండి: పర్యావరణ సంరక్షణకై కదిలిన దళం...

Last Updated : Apr 21, 2019, 8:42 AM IST

ABOUT THE AUTHOR

...view details