పారా బాడ్మింటన్ క్రీడాకారిణి మానసి జోషి, వాతావరణ మార్పుపై పోరాడిన రిధిమా పాండేకు 'బీబీసీ 100 విమెన్ 2020' జాబితాలో చోటు లభించింది. వీరితో పాటు 82ఏళ్ల బిల్కిస్ బానో, తమిళనాడుకు చెందిన ఇసాయ్వాణికి ఈ గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన, ప్రభావశీల మహిళలతో ఈ జాబితా రూపొందించారు. ప్రముఖ మహిళల నుంచి ప్రతిభ ఉన్నా గుర్తింపునకు నోచుకోనివారినీ లిస్టులో చేర్చారు.
'హౌ విమెన్ లీడ్ ఛేంజ్ ఇన్ 2020' ఈ సంవత్సరం ఇతివృత్తంగా ఉంది. కరోనాపై ముందుండి పోరాడిన మహిళా వైద్య సిబ్బందికి సైతం ఇందులో చోటు కల్పించారు.
నలుగరు భారతీయులు
మానసి జోషి పారా బాడ్మింటన్ సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకులో కొనసాగుతున్నారు. ఎన్నో రికార్డులు నెలకొల్పి యువతకు స్ఫూర్తిగా నిలిచారు.