బ్రిటన్‌లో అతిపెద్ద కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి ప్రాజెక్టును చేపడుతోంది ప్రముఖ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో భాగంగా కోతులపై జరిపిన పరిశోధనలో ఆశాజనక ఫలితాలు సాధించినట్లు విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు తెలిపారు. వ్యాక్సిన్‌ను ప్రయోగించిన కోతుల్లో రోగనిరోధక వ్యవస్థ కరోనాను నిలువరించినట్లు గుర్తించారు. అంతేకాకుండా ఎలాంటి దుష్ప్రభావాలు లేవని తేల్చారు.
ఈ అధ్యయానాన్ని ఇంకా పూర్తి స్థాయిలో సమీక్షించాల్సి ఉంది. ఒక్క డోసుతోనే కోతుల్లో ఊపిరితిత్తుల నష్టం జరగకుండా నిరోధించడం సహా ఇతర అవయవాలపైనా వైరస్ ప్రభావం ఏ మాత్రం పడకుండా నిలువరించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న ఆరు కోతులకు వ్యాక్సిన్ ఇచ్చిన అనంతరం నిమోనియా బారినపడలేదని, హానికర లక్షణాలను గుర్తించలేదని పరిశోధకులు వివరించారు.
బ్రిటన్‌లో మానవులపై జరుగుతున్న వ్యాక్సిన్ ప్రయోగం ఇంకా తుది దశకు చేరుకోనప్పటికీ ఇప్పుడు సాధించిన పురోగతి స్వాగతించదగినదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే మనుషులపై ఈ వ్యాక్సిన్ ఏ మేర ప్రభావం చూపుతుందో పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేశారు. తుది ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
మానవుల్లోనూ ప్రభావం...