జర్మనీలోని ఓ పందుల ఫాంయార్డ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 55 వేలకు పైగా జంతువులు మంటలకు ఆహుతైనట్లు ఫాంయార్డ్ ఆపరేటర్లు వెల్లడించారు.
ఈశాన్య జర్మనీలోని ఆల్ట్ టెల్లిన్ మున్సిపాలిటీలో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా అగ్నికీలలు ఫాంయార్డ్ అంతటా వ్యాపించాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు.