తెలంగాణ

telangana

By

Published : Nov 1, 2019, 5:31 AM IST

Updated : Nov 1, 2019, 8:03 AM IST

ETV Bharat / international

బ్రెగ్జిట్​ హాట్​సీట్​కు బ్రిటన్​ స్పీకర్​ రాజీనామా!

10 ఏళ్ల పాటు బ్రిటన్​.. హౌస్​ ఆఫ్​ కమెన్స్​కు స్పీకర్​గా వ్యవహరించిన జాన్​ బెర్కో రాజీనామా చేశారు. బ్రెగ్జిట్​ ఒప్పందంపై ఇప్పటివరకు జరిగిన చర్చలు, ఓటింగ్​లో ఆయన వ్యవహరించిన తీరు ఐరోపా ప్రజల్లో లెక్కలేని అభిమానాన్ని సంపాదించి పెట్టాయి.

బ్రెగ్జిట్​ హాట్​సీట్​కు బ్రిటన్​ స్పీకర్​ రాజీనామా!

బ్రెగ్జిట్​ హాట్​సీట్​కు బ్రిటన్​ స్పీకర్​ రాజీనామా!

జాన్​ బెర్కో... బ్రిటన్..​ హౌస్​ ఆఫ్​ కమెన్స్​కు 157వ స్పీకర్​. అయితే బ్రెగ్జిట్​ చర్చకు వచ్చిన ప్రతిసారి అందరి చూపు జాన్​ బెర్కో వైపే ఉంటుంది. ఇందుకు కారణం లేకపోలేదు. పార్లమెంటులో బ్రెగ్జిట్​పై జరిగిన వాడివేడీ చర్చల్లో ఆయన వ్యవహరించిన తీరు ఎంతోమంది ఐరోపా వాసుల మనసుల్ని గెలుచుకున్నాయి.

156వ స్పీకర్​గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజీనామా వరకు 14 వేల కన్నా ఎక్కువ సార్లు తనదైన రీతిలో 'ఆర్డర్​! ఆర్డర్' అన్నారు 56 ఏళ్ల బెర్కో. బెర్కోను కొంతమంది విమర్శించినప్పటికీ... ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అందరికీ అవకాశం కల్పించేవారని ఆయన మద్దతుదారులు కొనియాడతారు. ఆయన రాజీనామాకు ముందు.. చివరి పార్లమెంటు సెషన్​లో బెర్కో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చట్ట సభ్యులు​ ఆయనపై ప్రశంసలు కురిపించారు.

"కొన్ని విషయాల్లో మిమ్మల్ని వ్యతిరేకించినప్పటికీ... ఈ పార్లమెంటు, హౌస్​ ఆఫ్​ కమెన్స్​కు మీరు గొప్ప సేవకులు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు." - బోరిస్​ జాన్సన్​, బ్రిటన్​ ప్రధాని

"హౌస్​ ఆఫ్​ కమెన్స్​ను సంస్కరించడం కోసం మీరు ఎంతో చేశారు. ఆ సంస్కరణల వల్లే మన దేశ ప్రజాస్వామ్యం మరింత శక్తిమంతమైంది." - జెరెమీ కార్బన్​, లేబర్​ పార్టీ నేత

డిసెంబర్​ 12న జరగనున్న సాధారణ ఎన్నికలకు జాన్​ బెర్కో దూరంగా ఉండనున్నారు. ఆయన రాజీనామా చేయడం వల్ల సభాపతిగా మరొకరిని సోమవారం ఎన్నుకోనుంది సభ. ఇందుకోసం 9 మంది పోటీలో ఉన్నారు.

1997లో తొలిసారి ఎంపీగా నెగ్గారు బెర్కో. 12 ఏళ్ల తర్వాత ఆయన సభాపతిగా ఎన్నికయ్యారు. 100 ఏళ్ల దేశ చరిత్రలో అతి చిన్న వయసులో ఆ స్థానానికి చేరిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

ఆయన సభాపతిగా ఉన్న కాలంలో బ్రెగ్జిట్​ కారణంగా తీవ్ర ప్రతిష్టంభన ఎదుర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ఒకసారి.. బ్రిటన్​ పార్లమెంటులో ప్రసగించేందుకు బెర్కో అనుమతి నిరాకరించారు.

Last Updated : Nov 1, 2019, 8:03 AM IST

ABOUT THE AUTHOR

...view details