తెలంగాణ

telangana

ETV Bharat / international

విస్తరిస్తున్న 'ఒమిక్రాన్​'- భయం గుప్పిట్లో ఆ దేశాలు! - ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్​ కేసులు

omicron variant cases: ఇప్పటికే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొవిడ్​ రకాలకు తోడు కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ వేగంగా వ్యాపించటం కలవరపెడుతోంది. ఇప్పటికే 29 దేశాలకు ఈ వైరస్​ వ్యాప్తి చెందింది. దాంతో మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళుతున్నాయి చాలా దేశాలు. ఓవైపు విమర్శలు ఎదురవుతున్నా.. తమ ప్రజల భద్రత కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

omicron variant cases
ప్రపంచానికి 'ఒమిక్రాన్​' భయాలు

By

Published : Dec 2, 2021, 10:03 PM IST

Updated : Dec 2, 2021, 10:57 PM IST

omicron variant cases: ఒమిక్రాన్​ వేరియంట్​ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఉన్న డెల్టాకు తోడు కొత్త రకం విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. యావత్​ ప్రపంచ మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళుతోంది. గ్రీస్​లో ఒమిక్రాన్​ తొలి కేసు నమోదైనట్లు ఆ దేశ జాతీయ ఆరోగ్య విభాగం వెల్లడించింది. వైరస్​ సోకిన వ్యక్తిని క్వారంటైన్​కు తరలించినట్లు పేర్కొంది.​ ఈ క్రమంలో 60 ఏళ్లు పైబడిన వారు టీకా తీసుకునేందుకు నిరాకరిస్తే నెలకు 100 యూరోలు జరిమానా విధిస్తామని ప్రకింటింది. గ్రీక్​ దేశాల్లో 17 శాతం మంది 60 ఏళ్లుపైబడిన వారు టీకా తీసుకోలేదు. మరోవైపు.. కొవిడ్​తో మరణిస్తున్న ప్రతి10 మంది గ్రీకుల్లో 9 మంది వృద్ధులే కావటం గమనార్హం. ఈ నిర్ణయం రాజకీయంగా దెబ్బతీసినా.. ప్రజల ప్రాణాలను రక్షిస్తుందని ప్రధాని కైరియాకోస్​ మిట్సోటాకిస్​ తెలిపారు. ఇది సరైన నిర్ణయమేనని పేర్కొన్నారు. స్లోవకియా ప్రభుత్వం సైతం 500 యూరోలు ఫైన్​ విధిస్తోంది.

  • omicron variant in israel: ఒమిక్రాన్​ వేరియంట్​ను వ్యాప్తి చేసే వారిని గుర్తించేందుకు స్థానిక భద్రతా ఏజెన్సీలకు అధికారం ఇచ్చింది ఇజ్రాయెల్​. వివాదాస్పద ఫోన్​ మానిటరింగ్​ సాంకేతికతను కాంటాక్ట్​ ట్రేసింగ్​ కోసం తీసుకొచ్చింది. దీనిని హక్కుల సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రజల హక్కులను ఈ సాంకేతికత ఉల్లంఘిస్తోందని పేర్కొన్నాయి. ఇండోర్​ ప్రాంతాల్లో సరైన ఖచ్చితత్వంతో గుర్తించలేదని, పెద్ద సంఖ్యలో ప్రజలను తప్పుగా గుర్తించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
  • omicron variant in netherlands​: 5పీఎం లాక్​డౌన్​, ఇతర ఆంక్షలను అమలు చేయటాన్ని వ్యతిరేకిస్తూ నెదర్లాండ్​ ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య జరుగుతున్న ఘర్షణలు హింసాత్మకంగా మారుతున్నాయి. కొత్త నిబంధనలు తీసుకొచ్చినప్పటికీ చాలా మంది రోడ్లపైకి వస్తున్నారు.
  • omicron variant in europe: డెల్టా వేరియంట్​తో ఇప్పటికే ఐరోపా దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్తగా వెలుగుచూసిన ఒమిక్రాన్​తో ఆ భయాలు మరింత పెరిగాయి. బ్రిటన్​లో దుకాణాలు, ప్రజా రవాణాల్లో మాస్క్​ తప్పనిసరి చేసింది. విదేశీ ప్రయాణికులు తప్పనిసరిగా కొవిడ్​ పరీక్షలు చేసుకోవటం, క్వారంటైన్​కు వెళ్లటం వంటి నిబంధనలు విధించింది. కొవిడ్​-19ను కొత్త యాంటీబాడీ చికిత్సకు అనుమతించింది యూకే ఔషధ నియంత్రణ మండలి. ఒమిక్రాన్​ వంటి కొత్త వేరియంట్లపై ప్రభావంతంగా పని చేస్తుందని నమ్ముతోంది.
  • omicron variant in south africa: ఒమిక్రాన్​ వేరియంట్​ను తొలిసారి గుర్తించిన దేశం దక్షిణాఫ్రికా. ప్రస్తుతం వైరస్​ కేసులు పెరుగుతున్నందున గతంలోని ఆంక్షలను అమలులోకి తెచ్చింది. కర్ఫ్యూ, ఆల్కహాల్​ విక్రయాలపై నిషేధం వంటివి విధించింది. ప్రజలు వ్యాక్సిన్​ తీసుకోవాలని పిలుపునిచ్చారు అధ్యక్షుడు సిరిల్​ రామపోస.
  • చిలీ: ఒమిక్రాన్​ వెలుగులోకి వచ్చిన తర్వాత కట్టడి చర్యలు వేగవంతం చేసింది చిలీ. 18 ఏళ్లుపైబడిన వారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి బూస్టర్​ డోస్​ తీసుకోవాలని స్పష్టం చేసింది. బూస్టర్​ పాస్​ ఉంటేనే రెస్టారెంట్లు, హోటళ్లు, సామాజిక ప్రాంతాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
  • omicron variant in japan: దేశంలోకి వచ్చే అంతర్జాతీయ విమానాల అడ్వాన్స్​ బుకింగ్స్​పై నిషేధం విధించిన జపాన్​ వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయంపై విమర్శలు ఎదురైన క్రమంలో నిషేధాన్ని ఎత్తివేసింది.

దక్షిణ కొరియాలో రికార్డ్​ స్థాయిలో కొత్త కేసులు

దక్షిణ కొరియాలో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది. రోజువారీ కేసుల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. గురువారం 5,200 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఆసుపత్రుల్లో చేరుతున్నవారు, మరణాలు పెరగటం వల్ల ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఒమిక్రాన్​ వేరియంట్ భయాల మధ్య భారీగా డెల్టా కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో నైజీరియా నుంచి వచ్చిన వారిలో 5 ఒమిక్రాన్​ కేసులు వచ్చినట్లు గత బుధవారం రాత్రి ప్రకటించింది దక్షిణ కొరియా. దీంతో సరిహద్దుల్లో ఆంక్షలను కఠినతరం చేసినట్లు పేర్కొంది. వచ్చే రెండు వారాలపాటు దేశంలోకి వచ్చే వారు 10 రోజుల పాటు క్వారంటైన్​కు వెళ్లాలని స్పష్టం చేశారు. 8 ఆఫ్రికా దేశాలకు పర్యటనలను నిలిపివేసింది.

నార్వేపై ఒమిక్రాన్ పంజా

నార్వేపై ఒమిక్రాన్​ పంజా విసురుతోంది. రాజధాని కొపెన్​హగ్​ నగరం, పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 50 మందికి ఈ వైరస్​ సోకింది. ఒస్లో రెస్టారెంట్​లో ఓ సంస్థ నిర్వహించిన క్రిస్మస్​ పార్టీకి సంబంధం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు ట్రేసింగ్​ చర్యలను పెంచినట్లు చెప్పారు.

దక్షిణ ఆఫ్రికా విమానాలపై నిషేధం ఎత్తివేసిన ఫ్రాన్స్​

డిసెంబర్​ 4 నుంచి దక్షిణ ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాలను అనుమతిస్తామని ప్రకటించింది ఫ్రాన్స్​. కానీ, కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని, కేవలం ఫ్రెంచ్​, యూరోపియన్​ యూనియన్​ పౌరులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. వారంతా కొవిడ్​ పరీక్షలు చేసుకోవాలని, నెగెటివ్​ వచ్చినా ఏడు రోజుల క్వారంటైన్​కు వెళ్లాలని తెలిపింది. పాజిటివ్​గా తేలితే 10 రోజుల క్వారంటైన్​ ఉంటుందని పేర్కొంది. నవంబర్​ 26 నుంచి దక్షిణాఫ్రికా, బోట్స్​వానా, ఈస్వతిని లెసోతో, మొజాంబిక్​, నమీబియా, జింబాబ్వే దేశాల విమానాలపై నిషేధం విధించింది ఫ్రాన్స్​.

వర్ణవివక్షతతో సమానం: ఐరాస

ఒమిక్రాన్​ భయాలతో దక్షిణ ఆఫ్రికా దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించటం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​. అది వర్ణవివక్షతతో సమానమని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ప్రతి చోటా వైరస్​ ఉందని, ఇప్పుడు కొత్త వేరియంట్​ను ప్రపంచానికి చెప్పిన వారిపై ఆంక్షలు విధించటమే ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. సురక్షితమైన ప్రయాణాలకు అవసరమైన సామగ్రి ఉన్నప్పుడు వాటిని వినియోగించుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి:Omicron India: ఒమిక్రాన్​ గుబులు- భారత్​లో దాని తీవ్రత ఎంతంటే?

Last Updated : Dec 2, 2021, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details