Omicron reinfection news:గతంలో కరోనా బారిన పడ్డవారికి ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ సోకదని అపోహపడొద్దని తాజా అధ్యయనమొకటి హెచ్చరించింది. మునుపటి ఇన్‌ఫెక్షన్ తాలూకు రక్షణ వ్యవస్థను కొత్త వేరియంట్ తప్పించుకోగలుగుతోందని పేర్కొంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో విట్‌వాటర్స్‌రాండ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. అంతకుముందే కరోనా బారిన పడ్డవారికి.. డెల్టా సహా ఇతర వేరియంట్లు సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు వారు తెలిపారు. మునుపటి ఇన్‌ఫెక్షన్‌తో ఏర్పడిన రక్షణ వ్యవస్థను ఒమిక్రాన్ బురిడీ కొట్టించే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు.
Omicron threat asthma children:
ఆస్తమా బాధిత చిన్నారుల తల్లిదండ్రులకు హెచ్చరిక! ఇతరులతో పోలిస్తే... ఉబ్బసం నియంత్రణలో లేని చిన్నారులు కొవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరాల్సిన ముప్పు 3-6 రెట్లు అధికంగా ఉండొచ్చని తాజా పరిశోధన అంచనా వేసింది! కానీ, టీకా ఇవ్వడం ద్వారా ఇలాంటి పిల్లల్ని తీవ్ర అనారోగ్యం ముప్పు నుంచి కాపాడవచ్చని సూచించింది. స్ట్రాత్‌క్లైడ్ విశ్వవిద్యాలయం ఈ పరిశోధన సాగించింది. ఇందులో భాగంగా- స్కాట్‌లాండ్‌లో నిరుడు మార్చి నుంచి ఈ ఏడాది జులై వరకూ కొవిడ్ బారిన పడిన చిన్నారుల ఆరోగ్య వివరాలను నిపుణులు విశ్లేషించారు.