తెలంగాణ

telangana

ETV Bharat / international

తొలుత ఎలుకల్లో ఒమిక్రాన్‌.. ఆ తర్వాతే మనుషులకు!

Omicron evolved in rats: దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్.. తొలుత ఎలుకల్లో వృద్ధి చెంది ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎలుకల్లో ఇన్‌ఫెక్షన్‌ కలిగించడానికి ఉపయోగపడే ఏడు ఉత్పరివర్తనాలు ఒమిక్రాన్‌లో ఉన్నాయని చెబుతున్నారు. వైరస్‌ అనేక ఉత్పరివర్తనాలకు లోనై తిరిగి మానవుల్లోకి ప్రవేశించి ఉండొచ్చని వివరిస్తున్నారు.

OMICRON rats
ఎలుకల్లో ఒమిక్రాన్‌ వృద్ధి

By

Published : Dec 4, 2021, 7:10 AM IST

Omicron evolved in rats:కరోనాలో కొత్తగా వచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌.. మానవుల్లో కాకుండా ఇతర జంతువుల్లో వృద్ధి చెంది ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఎలుకల్లో ఈ పరిణామం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

Omicron first infection:

Omicron variant first detected:

వీరి సూత్రీకరణ ప్రకారం.. గత ఏడాది మధ్యలో కొవిడ్‌ కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ మానవుల నుంచి ఎలుకల్లోకి ప్రవేశించి ఉంటుంది. దీన్ని 'రివర్స్‌ జూనోసిస్‌' అంటారు. ఇలా ప్రవేశించిన వైరస్‌ అనేక ఉత్పరివర్తనాలకు లోనై ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ మార్పుల అనంతరం వైరస్‌ తిరిగి మానవుల్లోకి ప్రవేశించి ఉండొచ్చు. దీన్ని 'జూనోసిస్‌'గా పేర్కొంటారు.

చాలాకాలం కిందటే ఇతర కరోనా వేరియంట్లకు భిన్నంగా ఒమిక్రాన్‌ రూపాంతరం చెందడం మొదలుపెట్టిందని, తమ వాదనను బలపరిచే ఆధారం ఇదేనని స్క్రిప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఇమ్యునాలజిస్టు క్రిస్టియన్‌ ఆండర్‌సన్‌ తెలిపారు. ఈ వేరియంట్‌ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తిలో పరిణామం చెంది ఉంటుందన్న మరో సిద్ధాంతం కూడా ఉందని చెప్పారు. వీటన్నింటి కన్నా 'రివర్స్‌ జూనోసిస్‌, జూనోసిస్‌'కే ఎక్కువ ఆస్కారం ఉందన్నారు.

కొత్త వేరియంట్లలో వచ్చిన ఉత్పరివర్తనాలు చాలా అసాధారణంగా ఉండటం కూడా ఈ వాదనను బలపరుస్తోందని ఆండర్​సన్ చెప్పారు. ఎలుకల్లో ఇన్‌ఫెక్షన్‌ కలిగించడానికి ఉపయోగపడే ఏడు ఉత్పరివర్తనాలు ఒమిక్రాన్‌లో ఉన్నాయన్నారు. ఆల్ఫా వంటి మిగతా రకాల్లో కొన్ని మాత్రమే ఉన్నాయని తెలిపారు.

WHO on Omicron variant

దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్​ను బి.1.1.529గా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వేరియంట్​ చాలా అసాధారణమైన వైరస్ ఉత్పరివర్తనాల కలయిక అని తెలిపారు. ఇది రోగనిరోధక శక్తిని ఏమార్చి.. విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీనికి వ్యాక్సిన్ల నుంచి తప్పించుకోగల లేదా డెల్టా వేరియంట్ కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఉంటే.. పెను ముప్పుగా మారవచ్చు.

ఒమిక్రాన్‌ను 'ప్రపంచస్థాయి ఆందోళన కలిగించే వైరస్‌ రూపాంతరం'గా(వేరియంట్​ ఆఫ్​ కన్సర్న్​) డబ్యూహెచ్ఓ ప్రకటించింది. ఈ వేరియంట్​కు రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే సామర్థ్యం, వేగంగా వ్యాపించే లక్షణం, ఒమిక్రాన్​లోని స్పైక్​ ప్రోటీన్​ విపరీతంగా పరివర్తన చెందడం, రీఇన్​ఫెక్షన్ల కారణంగా భవిష్యత్తులో కేసులు పెరిగే అవకాశం ఉండటం సహా పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని వేరియంట్​ ఆఫ్​ కన్సర్న్​గా పేర్కొంది. ఈ వేరియంట్​పై ప్రస్తుత కరోనా టీకాలు ప్రభావంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి కొత్త వేరియంట్​ పట్ల జాగ్రత్తగా మసులుకోవాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.

ఇదీ చదవండి:ఒమిక్రాన్​పై టీకాలు పని చేస్తాయా? నిపుణుల మాటేంటి?

ABOUT THE AUTHOR

...view details