స్వీడిష్ అకాడమీ ఇవాళ సాహిత్యరంగంలో నోబెల్ పురస్కారాలను ప్రకటించింది. 2018 సంవత్సరానికిగాను పోలెండ్ రచయిత్రి ఓల్గా టోకార్జుక్, 2019కిగాను ఆస్ట్రియన్ నవలా, నాటక రచయిత పీటర్ హ్యాండ్కే ఈ విశిష్ట పురస్కారానికి ఎంపిక అయ్యారు.
లైంగిక వేధింపుల ఆరోపణలపై దుమారం నేపథ్యంలో 2018 నోబెల్‌ను గతేడాది ప్రకటించలేదు. ఆ పురస్కారాన్ని నేడు ప్రకటించారు.
1901 నుంచి సాహిత్యరంగంలో నోబెల్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు సాహిత్య నోబెల్ అందుకున్న మహిళల్లో ఓల్గా టోకార్జుక్ 15వ వారు. ఆమె తరంలో అత్యంత ప్రతిభావంతమైన నవలా రచయిత్రిగా పేరుపొందారు. కాల్పనిక కథలను మనస్సుకు హత్తుకునేలా, కవితాత్మకంగా తీర్చిదిద్దడంలో ఆమె సిద్ధహస్తురాలు. ప్రతిక్షణం మారిపోయే ఈ రంగుల ప్రపంచాన్ని ఆమె అద్భుతంగా చిత్రీకరిస్తారు.
హ్యాండ్కే.. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపాలో అత్యంత ప్రభావవంతమైన రచయితగా కీర్తిగడించారు. ఆయన రచనలు సరికొత్తగా ఉంటాయి. మానవ అనుబంధాల విశిష్టతను చక్కని భాషా చాతుర్యంతో హ్యాండ్కే వివరిస్తారు. అందుకే వీరిరువురూ ఈ విశిష్ట పురస్కారానికి ఎంపికయ్యారని అకాడమీ ప్రకటించింది.
భారీ బహుమతి