తెలంగాణ

telangana

ETV Bharat / international

డబ్ల్యూటీఓ డైరెక్టర్​ జనరల్​గా ఆఫ్రికన్​ మహిళ - Who is WTO new director general

నైజీరియాకు చెందిన నగోజీ ఒకోంజో ఐవియేలా ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) కొత్త డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. దీంతో ఈ సంస్థ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ, ఆఫ్రికన్​గా రికార్డు సృష్టించారు.

Okonjo-Iweala becomes first woman, African to lead WTO
డబ్ల్యూటీఓ నూతన డైరెక్టర్​ జనరల్​గా తొలి ఆఫ్రికన్​

By

Published : Feb 16, 2021, 7:04 AM IST

ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నూతన డైరెక్టర్​ జనరల్​గా నైజీరియాకు చెందిన నగోజీ ఒకోంజో ఐవియోలా నియమితులయ్యారు. దీంతో డబ్ల్యూటీఓ అత్తున్నత పదవిని చేపట్టిన తొలి మహిళ, తొలి ఆఫ్రికన్​గా ఆమె చరిత్రలో నిలిచిపోయారు.

66ఏళ్ల ఓకోంజోను 164 దేశాల ప్రతినిధుల డైరెక్టర్ జనరల్‌గా ప్రకటించారు. దేశాల మధ్య వాణిజ్య నియమాలతో వ్యవహరించేలా డబ్ల్యూటీఓను తయారు చేస్తామని ఆమె పేర్కొన్నారు.

కొవిడ్​-19 కారణంగా చిన్నాభిన్నమైన ప్రపంచ ఆర్థిక, ఆరోగ్య రంగాలను గాడిలో పెట్టేందుకు అవసరమైన విధానాలు అమలు చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు ఓకోంజో పేర్కొన్నారు. "డబ్ల్యూటీఓ పలు సవాళ్లను ఎదుర్కొంటుంది. సమష్టిగా పనిచేయడం ద్వారా సంస్థను మరింత బలంగా, చురుకైన వ్యవస్థగా, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చుతాం" అని ఓకోంజో ఓ ప్రకటనలో తెలిపారు.

ఇదీ చూడండి:వార్తలకు డబ్బులిచ్చేలా గూగుల్ భారీ ఒప్పందం

ABOUT THE AUTHOR

...view details