తెలంగాణ

telangana

ETV Bharat / international

కొవిడ్ ఆస్పత్రిలో మంటలు- 10 మంది మృతి - కొవిడ్ న్యూస్

కొవిడ్ చికిత్స అందించే ఆస్పత్రిలో మంటలు విజృంభించి (covid hospital fire) 10 మంది మరణానికి కారణమయ్యాయి. పేలుడు తర్వాత మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. బాధితులను ఇతర ఆస్పత్రులకు తరలించారు.

HOSPITAL FIRE
కొవిడ్ ఆస్పత్రిలో మంటలు

By

Published : Sep 9, 2021, 6:41 AM IST

Updated : Sep 9, 2021, 9:52 AM IST

కొవిడ్ ఆస్పత్రిలో మంటలు

ఐరోపాలోని ఉత్తర మెసిడోనియా (North Macedonia) దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. కొవిడ్ చికిత్స అందించే ఆస్పత్రిలో మంటలు చెలరేగి (covid hospital fire) 10 మంది మరణించారు. ఘటనలో అనేక మంది గాయపడ్డారు.

ఆస్పత్రి వద్ద అలుముకున్న పొగ

టెటొవో నగరంలో ఈ ప్రమాదం జరిగింది. ఇటీవల కరోనా కేసులు (covid cases) భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. క్షతగాత్రులతో పాటు మరికొందరు రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించినట్లు వైద్యాధికారులు తెలిపారు.

ఆస్పత్రి బయట ఇలా...

కారణం పేలుడే!

మంటలకు గల కారణాలు తెలియలేదు. అయితే, ఓ పేలుడు తర్వాత మంటలు సంభవించినట్లు ఆ దేశ ప్రధానమంత్రి (North Macedonia PM) జొరాన్ జాయెవ్ ఫేస్​బుక్ పోస్ట్​లో వెల్లడించారు.

మంటలకు ఆస్పత్రి నుంచి వస్తున్న పొగ

ఆగస్టు నుంచి ఉత్తర మెసిడోనియాలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దేశ జనాభాలో 30 శాతం మందికి మాత్రమే రెండు డోసుల టీకాలు వేశారు.

ఇదీ చదవండి:పంజ్​షేర్​లో తాలిబన్ల మారణహోమం- ఐరాస స్పందించేనా?

Last Updated : Sep 9, 2021, 9:52 AM IST

ABOUT THE AUTHOR

...view details