తెలంగాణ

telangana

ETV Bharat / international

సెప్టెంబర్​ 19 వరకు 'నీరవ్​ మోదీ' రిమాండ్​ పొడిగింపు - లండన్​

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు సుమారు 2 బిలియన్‌ డాలర్ల రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన నీరవ్‌ మోదీ వీడియో లింక్​ ద్వారా వెస్ట్‌మినిస్టర్ కోర్టు విచారణకు హాజరయ్యారు. విచారించిన కోర్టు ఆయన రిమాండ్‌ను సెప్టెంబర్‌ 19 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

సెప్టెంబర్​ 19 వరకు 'నీరవ్​ మోదీ' రిమాండ్​ పొడిగింపు

By

Published : Aug 22, 2019, 7:52 PM IST

Updated : Sep 27, 2019, 10:04 PM IST

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్​ మోదీ రిమాండ్​ను సెప్టెంబర్​ 19 వరకు పొడిగిస్తూ వెస్ట్​మినిస్టర్​ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసగించిన కేసులో వీడియో లింక్ ద్వారా బ్రిటన్​ కోర్టు విచారణకు హాజరయ్యారు నీరవ్‌ మోదీ. ఈ మేరకు విచారించిన కోర్టు సెప్టెంబర్ 19న తదుపరి విచారణకు సంబంధించిన తేదీలు ఖరారు చేసే అవకాశముందని తెలిపింది.

మార్చి19న నీరవ్‌ మోదీని అరెస్టు చేసిన స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైల్లో ఉంచారు.

ఏప్రిల్​ 8 నాటికి ఆధారాలు...

నీరవ్​ని భారత్‌కు అప్పగించే అంశంపై 2020 మే 11 నుంచి ఐదు రోజులు విచారణ జరపాలని ఇప్పటికే కోర్టు తాత్కాలికంగా తేదీలు నిర్ణయించింది. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్‌ 8 నాటికి నీరవ్‌ మోదీ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు తమకు అందుతాయని.. ఆ తర్వాత భారత్‌కు అప్పగించే అంశంపై విచారణ జరుగుతుందని వెస్ట్​మినిస్టర్‌ కోర్టు న్యాయమూర్తి తెలిపారు.

ఈ కేసులో స్కాట్లాండ్‌ యార్డ్‌ పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుంచి నీరవ్ మోదీ పలుసార్లు బెయిల్‌ కోసం చేసిన ప్రయత్నాలను కోర్టు కొట్టివేసింది.

ఇదీ చూడండి: సోమవారం వరకు సీబీఐ కస్టడీలో చిదంబరం

Last Updated : Sep 27, 2019, 10:04 PM IST

ABOUT THE AUTHOR

...view details