పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ రిమాండును బ్రిటన్ న్యాయస్థానం ఫిబ్రవరి 25 వరకు పొడిగించింది. భారత్‌కు అప్పగించే వ్యాజ్యంపై కూడా అదే రోజునే తుది తీర్పును వెలువరించనుంది న్యాయస్థానం. శుక్రవారం.. మోదీ లండన్‌లో తానుంటున్న కారాగారం నుంచి వీడియో లింక్ ద్వారా వెస్ట్ మినిస్టర్ కోర్టులో జరిగిన విచారణలో పాల్గొన్నారు.
నీరవ్ మోదీ అప్పగింతపై ఈనెల 25న తుది తీర్పు - నీరవ్ మోదీ భారత్‌కు అప్పగింత
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేలకోట్లు ఎగ్గొట్టిన కేసుకు సంబంధించి మనీలాండరింగ్, మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ రిమాండ్‌ను ఈ నెల 25వరకు పొడిగించింది బ్రిటన్ న్యాయస్థానం. నీరవ్‌ను.. భారత్‌కు అప్పగించే వ్యాజ్యంపై కూడా అదే రోజున విచారణ చేస్తామంది.
నీరవ్ మోదీ అప్పగింతపై ఈనెల 25న తుది తీర్పు
ఈ సందర్భంగా న్యాయయూర్తి హామిల్టన్ నీరవ్ రిమాండును.. తుది తీర్పు వెలువడే 25వ తేదీ వరకు పొడిగించారు. ఆ రోజు కూడా మోదీ వీడియా లింక్ ద్వారానే విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.