పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ రిమాండ్‌ను మరో 28రోజులు వరకు పొడిగిస్తూ వెస్ట్‌మినిస్టర్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డిసెంబర్ 29 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు నీరవ్. ప్రస్తుతం వాండ్స్‌వర్త్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నీరవ్.. వీడియో లింక్ ద్వారా విచారణకు హాజరయ్యారు.
మరో 28 రోజులు రిమాండ్‌లోనే నీరవ్ మోదీ - Punjab National Bank scam case latest news
రుణఎగవేతదారు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ రిమాండ్‌ను మరో 28 రోజులు పొడిగించింది లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టు. లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైల్లో ఉన్న నీరవ్.. వీడియోలింక్ ద్వారా విచారణకు హాజరయ్యారు.

మరో 28 రోజులు రిమాండ్‌లోనే నీరవ్ మోదీ
భారత్‌కు అప్పగించే అంశంపై వచ్చే ఏడాది జనవరి 7, 8 తేదీల్లో తదుపరి విచారణ జరపనున్నట్లు కోర్టు పేర్కొంది. ఆయనను స్వదేశానికి రప్పించాలని భారత్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది.
ఇదీ చూడండి:ఆ నగరంపై దుండగులు దండయాత్ర- బ్యాంక్ లూటీ