రూ.14 వేల కోట్ల మేర భారత బ్యాంకులను మోసగించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ.. నేడు లండన్ కోర్టులో హాజరుకానున్నారు. ఆయనను భారత్‌కు అప్పగించే అంశంపై న్యాయస్థానం విచారణ జరపనుంది. ప్రస్తుతం వాండ్స్‌వర్త్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.
నేడు లండన్ కోర్టులో హాజరుకానున్న నీరవ్ - londaon
ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ నేడు లండన్ కోర్టు ఎదుట హాజరుకానున్నారు. రూ.14 వేల కోట్ల మేర భారత బ్యాంకులను మోసగించిన కేసులో ఆయనను భారత్‌కు అప్పగింతపై న్యాయస్థానం విచారణ జరపనుంది.
నేడు లండన్ కోర్టులో హాజరుకానున్న నీరవ్
నీరవ్ మూడో బెయిల్ పిటిషన్‌ను ఈనెల మొదట్లోనే తిరస్కరించింది లండన్ న్యాయస్థానం. సెక్యూరిటీ డిపాజిట్‌ను 2 మిలియన్ పౌండ్ల డాలర్లకు పెంచేందుకు సిద్ధమని నీరవ్ తెలిపినా బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది. ఆర్థిక నేరం కేసులో నీరవ్ లొంగిపోతారని తాము విశ్వసించడం లేదని కోర్టు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: నేడు మరోసారి ఈడీ ఎదుట విచారణకు వాద్రా...
Last Updated : May 30, 2019, 7:38 AM IST