తెలంగాణ

telangana

ETV Bharat / international

'కరోనా ఇంకా ముగియలేదు.. మనం అనుకున్నప్పుడే..' - ఒమిక్రాన్​ తర్వాత వేరియంట్

Next Covid Variant: వేగంగా ప్రబలే మరింత ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టుకురావడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) హెచ్చరించింది. అయితే కలిసికట్టుగా దీన్ని అంతం చేయవచ్చని పేర్కొన్నారు.

Next Covid Variant
Next Covid Variant

By

Published : Feb 19, 2022, 3:36 PM IST

Next Covid Variant: మరింత ప్రమాదకరమైన, వేగంగా ప్రబలే వేరియంట్లు పుట్టుకురావడానికి పరిస్థితులు అనువుగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించించింది. అయితే మనం దానిని ముగించాలనుకున్నప్పుడు అది ముగిసిపోతుందని వ్యాఖ్యానించింది. తాజాగా జర్మనీ నగరమైన మ్యూనిచ్‌లో జరిగిన లైవ్‌ సెషన్ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధనామ్ కొవిడ్ పరిస్థితులపై మాట్లాడారు.

'కరోనావైరస్ వెలుగులోకి వచ్చిన సమయంలో.. ఇలా మహమ్మారితో మూడో ఏడాదిలోకి ప్రవేశిస్తామని ఎవరూ ఊహించి ఉండరు. మరోపక్క మరింత ప్రమాదకరమైన, వేగంగా ప్రబలే వేరియంట్లు పుట్టుకురావడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అయితే మనం కలిసికట్టుగా దీన్ని అంతం చేయవచ్చు. ఒమిక్రాన్‌తో స్వల్ప లక్షణాలు, అధిక స్థాయిలో వ్యాక్సినేషన్‌ రేటును చూపించి.. కరోనా ముగిసిపోయింటూ కొన్ని ప్రమాదకరమైన కథనాలు ప్రచారం అవుతున్నాయి. కానీ అది ముగిసిపోలేదు. ఎందుకంటే ఒక వారంలో 70 వేల కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఆఫ్రికాలో 83 శాతం జనాభాకు కొవిడ్ టీకాలు అందలేదు. కేసులు పెరుగుదలతో ఆరోగ్య వ్యవస్థలు ఒత్తిడికి గురవుతున్నాయి" అంటూ టెడ్రోస్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు.

అయితే పరిస్థితులు భయానకంగా మాత్రం లేవన్నారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో మనకు ఇప్పుడు తగిన సాధానాలున్నాయని గుర్తుచేశారు. మనం ముగించాలనుకున్నప్పుడే.. కరోనా ముగుస్తుందని చెప్పి, కలిసికట్టు ప్రయత్న ఆవశ్యకతను తెలియజేశారు.

ఇదీ చూడండి:ఐరోపాలో తుపాను బీభత్సం.. తొమ్మిది మంది మృతి

ABOUT THE AUTHOR

...view details