తెలంగాణ

telangana

ETV Bharat / international

చర్చి చట్టాల్లో కీలక మార్పు- అలా చేస్తే ఇక శిక్ష! - Pope Francis SEX ABUSE LAW

లైంగిక వేధింపుల సమస్యల పరిష్కారం దిశగా క్యాథలిక్ చర్చి చట్టాల్లో కీలక మార్పు చేశారు పోప్ ఫ్రాన్సిస్. వయోజనులపై లైంగిక దాడులను నేరపూరితమైన చర్యలుగా గుర్తించనున్నారు.

New Vatican law criminalizes abuse of adults, even by laity
లైంగిక దాడులపై క్యాథలిక్ చట్టాల్లో మార్పు

By

Published : Jun 1, 2021, 4:23 PM IST

యువతపై పాస్టర్ల లైంగిక వేధింపులను నేరపూరితమైన చర్యలుగా పేర్కొనేలా చర్చి చట్టాల్లో మార్పులు చేశారు పోప్ ఫ్రాన్సిస్. తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై సంబంధిత చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నారు.

లైంగిక వేధింపుల సమస్యకు పరిష్కారంగా 14 ఏళ్ల పాటు విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ నిబంధనలను రూపొందించారు. 'వాటికన్ కోడ్ ఆఫ్ కెనాన్ లా'లోని 1395, 1398 ఆర్టికల్​లలో వీటిని పొందుపర్చారు. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల క్యాథలిక్ చర్చిలు ఈ చట్టం పరిధిలో ఉన్నాయి. పాస్టర్ల లైంగిక దాడులకు వయోజనులు సైతం బాధితులుగా మారే అవకాశం ఉందని ఈ చట్టం గుర్తిస్తుంది.

ఇదీ చదవండి-చైనాలోని ఆ పట్టణంలో మళ్లీ లాక్​డౌన్

ABOUT THE AUTHOR

...view details