తెలంగాణ

telangana

ETV Bharat / international

'డెల్టా' వేరియంట్​లో కొత్త రకం వైరస్.. ఆ దేశంలో విజృంభణ - డెల్టా వైరస్ గురించి చెప్పండి?

ఇంగ్లాండ్​లో కరోనా విజృంభిస్తోంది. డెల్టా ప్లస్​గా చెబుతున్న ఏ.వై.4.2(AY.4.2) క్రమంగా విస్తరిస్తోంది. దీనితో దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గతకొన్ని రోజులుగా యూకేలో క్రమంగా కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి.

delta
డెల్టా

By

Published : Oct 20, 2021, 4:57 AM IST

ఇంగ్లాండ్​లో కరోనా డెల్టా వేరియంట్ ఏ.వై.4.2(AY.4.2) గుబులు రేపుతోంది. ఈ వేరియంట్ సోకుతున్నట్లు ఇంగ్లాండ్‌ ఆరోగ్య శాఖ గుర్తించింది. ఈ వైరస్ ప్రభావంతో జులై తర్వాత అత్యధికంగా.. సోమవారం ఒక్కరోజే 49,156 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

మరోవైపు.. దేశంలో నమోదవుతున్నకేసులకు ఏ.వై.4.2(AY.4.2) కారణం కాదని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. 'ఆల్ఫా, డెల్టాతో పోలిస్తే ఇది అంత ప్రమాదకరం కాదు. అవి 50-60 శాతం ఎక్కువ వేగంగా సంక్రమించగలవు. ఇది 10 శాతం వరకే వ్యాప్తి చెందే అవకాశం ఉంది' అని ఓ వైద్యాధికారి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details