కరోనా వైరస్ సోకిన వారిలో చాలా అవయవాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో మెడ కూడా చేరింది. కొవిడ్ నుంచి కోలుకొన్న వారిలో తీవ్రమైన మెడనొప్పి వస్తున్నట్లు ఇటలీలోని 'యూనివర్సిటీ హాస్పిటల్ ఆఫ్ పీసా' వైద్యులు గుర్తించారు. దీన్ని 'సబ్‌అక్యూట్ థైరాయిడిటిస్'గా వ్యవహరిస్తారు. కొన్నాళ్ల కిందట ఇటలీలో ఒక యువతికి కరోనా సోకడం వల్ల చికిత్స తీసుకొని కొలుకొంది. ఇంటికి వెళ్లాక ఆమెకు మెడ, థైరాయిడ్ గ్రంథి వద్ద తీవ్రమైన నొప్పి మొదలైంది. దీనికి తోడు జ్వరం కూడా రావడం వల్ల వైద్యులను ఆశ్రయించింది. ఆమెకు సబ్‌అక్యూట్ థైరాయిడిటిస్ సమస్య, జ్వరం తలెత్తినట్లు గుర్తించారు. సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ల బారినపడినా.. వాటి నుంచి కోలుకొన్నా శరీరంలో ఇన్‌ఫ్లమేటరీ రీయాక్షన్ కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. వైరస్ కారణంగా సోకే చాలా వ్యాధుల్లో ఈ లక్షణం కనిపిస్తుంది. నెలరోజుల తర్వాత ఆ యువతి ఆరోగ్యం కుదుటపడింది. సార్స్ కోవ్2 కారణంగానే ఈ సమస్య తలెత్తి ఉంటుందని డాక్టర్ లట్రోఫా రోట్ ‘ది జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం’లో పేర్కొన్నారు.
సబ్‌అక్యూట్ థైరాయిడిటిస్ అంటే..