తెలంగాణ

telangana

ETV Bharat / international

'వైరస్​ వ్యాప్తిని అరికట్టాలంటే లాక్​డౌన్​ తప్పనిసరి' - వివిధ దేశాల్లో లాక్​డౌన్​ ప్రభావం

కరోనా వైరస్​ వ్యాప్తిని అదుపు చేయాలంటే లాక్​డౌన్​తో కూడిన కట్టుదిట్టమైన చర్యలు తప్పనిసరి అని 'నేచర్ రీసెర్చ్' తెలిపింది. కానీ, ఈ చర్యతో ప్రజల్లో మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని భావిస్తోంది. గతంలో వైరస్ ఉద్ధృతిని అడ్డుకోవడంలో లాక్​డౌన్​ కీలక పాత్ర పోషించినట్లు పేర్కొంది.

nature research
'వైరస్​ వ్యాప్తిని అరికట్టాలంటే లాక్​డౌన్​ తప్పనిసరి'

By

Published : Nov 19, 2020, 6:44 PM IST

కరోనా వ్యాప్తిని అదుపు చేయడంలో అనేక దేశాల్లో విధించిన లాక్​డౌన్, కర్ఫ్యూ​ మొదలైన కట్టుదిట్టమైన చర్యలు ముఖ్యపాత్ర పోషించాయని 'నేచర్ రీసెర్చ్' మెడికల్​ అండ్ సైన్స్​ జర్నల్​ చేసిన పరిశోధనలో తేలింది.

" శీతాకాలంలో, ముఖ్యంగా పండుగ తర్వాత కొవిడ్​ ఉద్ధృతిపై అప్రమత్తత అవసరం. మాస్క్​లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేయడమే కాకుండా 50 మందికి పైగా సమావేశమయ్యే అవకాశం లేకుండా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా మంచి ఫలితాన్ని ఇచ్చాయి".

-డాక్టర్ తమోరిష్ కోలె, ఏషియన్​ సొసైటీ ఫర్​ ఎమర్జెన్సీ మెడిసిన్ అధ్యక్షుడు.

మానసిక ఒత్తిడి మరింతగా..!

గతంలో కట్టుదిట్టమైన చర్యలు వైరస్​ వ్యాప్తిని అదుపు చేయగలిగినా.. ఆ చర్యల వల్ల ప్రజల్లో మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు పెరిగినట్లు పరిశోధనలో వెల్లడైంది. ఒకవేళ మళ్లీ లాక్​డౌన్​ విధించినా ఈ సమస్యలు మరితంగా వచ్చే అవకాశముందని 'నేచర్​ రీసెర్చ్' భావించింది.

79 దేశాల్లో పలు నిబంధనలతో విధించిన 6,068 కట్టుదిట్టమైన విధానాలను 'నేచర్​ రీసెర్చ్​' పరిశీలించింది. ఇందుకోసం కృత్రిమ మేథ వంటి టూల్స్​ను ఉపయోగించింది. తమ పరిశోధన అనంతరం... 226 దేశాల్లో 42,151 కట్టుదిట్టమైన చర్యల విధానాలపై ఇతర సంస్థలు చేసిన పరిశోధన ఫలితాలను తమ సంస్థతో పోల్చుకుంది.

ఏది ఏమైనా వైరస్​ వ్యాప్తిని అడ్డుకోవాలంటే.. డౌన్​తో కూడిన కఠిన చర్యలు అత్యవసరమని 'నేచర్​ రీసెర్చ్' సంస్థ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:మరో రెండు కేసుల్లో హఫీజ్ సయీద్​​కు పదేళ్లు జైలు

ABOUT THE AUTHOR

...view details