తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​ను గేలి చేస్తూ కెమెరాకు చిక్కిన దేశాధినేతలు

అది నాటో సదస్సు కోసం ఏర్పాటు చేసిన ముందస్తు సమావేశం. సభ్యదేశాధినేతలందరూ పాల్గొన్నారు. వారంతా కలిసి ఒక్కచోట చేరితే ఏమవుతుంది? సాధారణంగా వాణిజ్యం, ఆర్థికాంశాలు మరే ఇతర ఒప్పందాల గురించో మాట్లాడుకుంటారు. అయితే ఇక్కడ మాత్రం పలు దేశాధినేతలు కలిసి అమెరికా అధ్యక్షుడిని గేలి చేస్తూ కనిపించారు. వారి సంభాషణ మొత్తం కెమెరాలో రికార్డయింది.

NATO leaders caught on camera mocking Trump
ట్రంప్​

By

Published : Dec 5, 2019, 9:38 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ను గేలి చేస్తూ.. కెమెరాకు చిక్కారు దేశాధినేతలు. నాటో సదస్సుకు ముందు లండన్ బకింగ్​హం ప్యాలెస్​లో సభ్యదేశాల అధినేతలందరూ సమావేశమయ్యారు. బ్రిటన్​, కెనడా, ఫ్రాన్స్, నెదర్లాండ్​ దేశాధ్యక్షులు ఓ చోట చేరి ముచ్చటించుకున్నారు. ఆ సన్నివేశాలు.. అక్కడి కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే వీరి సంభాషణ పూర్తిగా డొనాల్డ్ ట్రంప్​ గురించేనని తెలుస్తోంది.

వీడియోలో బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ 'ఇందుకోసమేనా మీరు ఆలస్యంగా వచ్చారు?' అంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్​ను అడుగుతున్నట్లు కనిపించారు. మధ్యలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కల్పించుకొని 'ఆయన 40 నిమిషాల పాటు మీడియా సమావేశం పాల్గొని వచ్చారు' అంటూ బదులిచ్చారు.

మంగళవారం అమెరికా అధ్యక్షుడితో మేక్రాన్​ కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. నాటో వ్యూహాలు, వ్యాపార ఒప్పందాలపై బహిరంగంగానే విభేదించుకున్న నేపథ్యంలో ప్రశ్నోత్తరాలు సుదీర్ఘంగా సాగాయి. ఈ సమావేశాన్ని గుర్తు చేస్తూ.. ట్రూడో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత ట్రూడో మాట్లాడుతూ... 'అతని బృందం మొత్తం ఆశ్చర్యపోయిన విషయం మీరు చూశారు' అంటూ వ్యాఖ్యానించారు. దీంతోపాటు బ్రిటన్ యువరాణి 'యాన్', నెదర్లాండ్​ ప్రధాని మార్క్​ రుట్టే గురించి చమత్కారంగా మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:డొనాల్డ్​ ట్రంప్-కమలా హారిస్​ల ట్వీట్​ వార్

ABOUT THE AUTHOR

...view details