కరోనా డెల్టా రకం వేరియంట్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న తరుణంలో ఇంటర్నేషనల్ సైన్స్ జర్నల్ 'నేచర్' తాజా అధ్యయనం ఊరటనిస్తోంది. భారత్‌లో తొలిసారి గుర్తించిన ఈ వేరియంట్ నుంచి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు పూర్తి రక్షణ కల్పిస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది.
బీఎన్టీ162బీ2 ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కొవిడ్19పై 95 శాతం సమర్థతతో పనిచేస్తుంది. సార్క్ కొవ్-2ను ఎదుర్కొనేందుకు అవసరమైన రక్షణ వ్యవస్థను ఇది ఏర్పరుస్తుంది.
'అన్ని రకాల కరోనా వేరియంట్లపై ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఏ మేరకు రక్షణ కల్పిస్తుందో తెలుసుకునేందుకు గోల్డ్ స్టాండర్డ్ పీఆర్ఎన్టీ50 పరీక్షను ఉపయోగించి వేరియంట్ స్పైక్ జన్యువులను రూపొందించాం. బీఎన్టీ162బీ2 వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సెరా.. కరోనా వేరియంట్లను ఎలా నిర్వీర్యం చేస్తుందో పరిశీలించాం. పరీక్షించిన అన్ని రకాల వైరస్‌లతో పోల్చితే B.1.3514 , B.1.617.1 స్పైక్ ప్రోటీన్ల నిర్వీర్యంలో సెరా ప్రభావశీలత తగ్గింది.' అని నేచర్ జర్నల్ అధ్యయనం పేర్కొంది.
అధ్యయనంలోని కీలక విషయాలు..
- ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో బీఎన్టీ162బీ2 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికి B.1.3514 , B.1.617.1 వేరియంట్ల నుంచి 75 శాతం రక్షణ లభించింది. తీవ్ర అనారోగ్యం, మరణం సంభవించకుండా ఈ టీకా 100 శాతం ప్రభావశీలతతో పనిచేసింది.
- B.1.617.1(కప్ప), B.1.617.2 (డెల్టా) వేరియంట్లను తొలిసారిగా భారత్‌లోనే గుర్తించారు. దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతంగా వ్యాప్తి చెంది, అధిక మరణాలు సంభవించడానికి డెల్టా వేరియంటే కారణం.
- బ్రిటన్‌లో నిర్వహించిన అధ్యయనంలో బీఎన్టీ162బీ2 వ్యాక్సిన్ B.1.617.2 వేరియంట్‌పై 87.9 శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. B.1.1.7 రకంపై మాత్రం 93.4 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది.
- కరోనా ఉన్నంత కాలం కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయని పరిశోధన స్పష్టం చేసింది. BNT162b2 వ్యాక్సిన్ల నుంచి ఏ రకం వేరియంటైనా తప్పించుకున్నట్లు ఇప్పటివరకు ఆధారాల్లేవని తేల్చి చెప్పింది. వీలైనంత త్వరగా ప్రజలందరికీ వ్యాక్సిన్లు అందిస్తేనే కరోనాను త్వరగా అంతం చేయవచ్చని తెలిపింది.
సాధారణ వ్యాక్సిన్లకు, ఎంఆర్ఎన్కు తేడా అదే..