తెలంగాణ

telangana

ETV Bharat / international

లక్షణాలు లేని కేసులు చాలా తక్కువ!

కరోనా వైరస్ సంక్రమించిన వారిలో లక్షణాలు లేని కేసులు చాలా తక్కువని తాజా అధ్యయనం వెల్లడించింది. పరీక్షించిన సమయంలో కరోనా పాజిటివ్​గా తేలినా.. ఏదో ఓ సమయంలో లక్షణాలు కనిపించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇలాంటి వారంతా ఇతరులకు సోకకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.

VIRUS-INFECTION-SYMPTOMS
లక్షణాలు లేని కేసులు

By

Published : Sep 23, 2020, 1:26 PM IST

కరోనా వైరస్ సోకిన వారిలో లక్షణాలకు సంబంధించి చాలా గందరగోళం నెలకొంది. ఈ మహమ్మారి కొంతమందిలో నిమోనియా లాంటి తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుండగా.. మరికొంతమందిలో అసలు ఏ లక్షణాలు ఉండటం లేదు.

అయితే, వైరస్​ సోకిన వారిలో 80 శాతం మందికిపైగా లక్షణాలు కనిపిస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. స్విట్జర్లాండ్​ బెర్న్​ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో.. అసింప్టొమెటిక్ కేసులు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఫలితాలు పీఎల్​ఓఎస్​ మెడిసిన్ జర్నల్​లో ప్రచురితమయ్యాయి.

తక్కువే..

కానీ, కరోనా లక్షణాలకు సంబంధించి పూర్తి స్థాయి అవగాహనకు రాలేకపోయామని స్పష్టం చేశారు పరిశోధకులు. అసింప్టొమెటిక్​ కేసులకు సంబంధించి.. పరీక్ష నిర్వహించిన సమయంలో లక్షణాలు లేకపోయినా కొద్ది రోజుల తర్వాత వస్తున్నట్లు తెలిపారు. వీరు చేసిన అధ్యయనంలో 6,616 మందిలో 1,287 మాత్రమే అసింప్టొమెటిక్​గా తేలినట్లు వెల్లడించారు.

ఇందులోనూ కొన్ని కారణాల వల్ల లక్షణాలు లేనివారి సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వైరస్​ శరీరంలో ఉన్నంత వరకు కనీసం 80 శాతం మందిలో లక్షణాలు కనిపించే అవకాశం కచ్చితంగా చెబుతున్నారు. అయితే, వీరంతా ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు.

ఇదీ చూడండి:వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details