తెలంగాణ

telangana

ETV Bharat / international

పరువు నష్టం కేసులో 'నావల్నీ'కి జరిమానా - రష్యా వార్తలు

రష్యా ప్రతిపక్ష నేత అలెక్స్​ నావల్నీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. జైలు శిక్షకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్​ కొట్టివేసిన కొద్ది సమయానికే.. పరువు నష్టం కేసులో భారీ జరిమానా విధించింది మాస్కో కోర్టు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న నేతలపై చేసిన ఆరోపణల్లో దోషిగా తేల్చింది.

opposition leader Navalny
పరువు నష్టం కేసులో 'నావల్నీ'కి భారీ జరిమానా

By

Published : Feb 21, 2021, 5:10 AM IST

పరువు నష్టం కేసులో రష్యా ప్రతిపక్ష నేత అలెక్స్​ నావల్నీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో దోషిగా తేల్చుతూ భారీగా జరిమానా విధించింది మాస్కో సిటీ కోర్టు. తనపై విధించిన జైలు శిక్షకు వ్యతిరేకంగా నావల్నీ దాఖలు చేసిన పటిషన్​ను మరో న్యాయమూర్తి తిరస్కరించిన కొద్ది సమయానికే జరిమానా విధించటం ప్రాధాన్యం సంతరించుకుంది.

రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న నేతను దూషించినట్లు దాఖలైన పరువునష్టం కేసులో నావల్నీని దోషిగా తేల్చింది మాస్కో కోర్టు. 11,500 డాలర్లు (రూ.8,34,340)లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

గత ఏడాది క్రెమ్లిన్ అనుకూల వీడియోలో కనిపించిన 94 ఏళ్ల నేత, ఇతర వ్యక్తులపై ఆరోపణలు చేశారు నావల్నీ. అవినీతిపరులు, దేశద్రోహులుగా పేర్కొన్నారు. ఈనేపథ్యంలో నావల్నీపై పరువునష్టం కేసు నమోదైంది.

ఇదీ చూడండి:నావల్నీ పిటిషన్​ను తిరస్కరించిన కోర్టు

ABOUT THE AUTHOR

...view details