తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇటలీలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం - ఈయూ భారత్ చర్చలు

జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీలోని రోమ్​కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి భారత సంతతి ప్రజలు ఘనస్వాగతం పలికారు. మరోవైపు.. యూరోపియన్‌ యూనియన్ దేశాధినేతలతో సమావేశమయ్యారు ప్రధాని నరేంద్రమోదీ.

Modi
మోదీ

By

Published : Oct 29, 2021, 4:58 PM IST

Updated : Oct 29, 2021, 5:50 PM IST

మోదీ

జీ20 సదస్సులో భాగంగా ఇటలీలోని రోమ్​కు చేరుకున్న ప్రధాని మోదీకి భారత సంతతి ప్రజలు ఘనస్వాగతం పలికారు. దీంతో పియాజ్​ గాంధీ ప్రాంతంలో సందడి నెలకొంది. తనను స్వాగతించేందుకు వచ్చిన ప్రజలతో మోదీ కాసేపు ముచ్చటించారు. పియాజ్​ గాంధీ ప్రాంతంలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.

భారత సంతతి ప్రజలకు అభివాదం చేస్తున్న మోదీ

ఈయూ దేశాధినేతలతో మోదీ సమావేశం..

జీ20 సమావేశం కోసం ఇటలీ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మైకేల్‌, యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు ఉర్సులా వాన్​ డెర్‌ లెయన్‌తో సమావేశమయ్యారు. ఐరోపా, భారత్ మధ్య వ్యాపార సంబంధాలు, వాతావరణ మార్పు, కొవిడ్-19, అంతర్జాతీయ, ప్రాంతీయ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు.

1960 నుంచే..

ప్రధాని మోదీను స్వాగతించేందుకు వచ్చిన భారత సంతతి ప్రజలు

1960లో భారత్‌-ఈయూ మధ్య.. ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమయ్యాయి. 1962లో యూరోపియన్‌ ఎకనామిక్‌ కమ్యూనిటీతో ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభించిన తొలి దేశాల్లో భారత్‌ ఒకటిగా ఉంది. మొదటిసారిగా 2000 జూన్ 28న భారత్- ఈయూ సమావేశం జరిగింది.

ఇదీ చూడండి:'అప్పటి వరకు తక్కువ తినండి'- ప్రజలకు కిమ్​ పిలుపు!

Last Updated : Oct 29, 2021, 5:50 PM IST

ABOUT THE AUTHOR

...view details