తెలంగాణ

telangana

ETV Bharat / international

యూకేలో పటిష్టంగా లాక్​డౌన్​.. ఆంక్షల్లో లక్షల మంది - Coronavirus news is UK

బ్రిటన్​లో కరోనా వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి లాక్​డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేసింది అక్కడి ప్రభుత్వం. ఫలితంగా లక్షల మంది ప్రజలు ఆంక్షల్లోనే ఉండనున్నారు.

corona lockdown
యూకేలో కరోనా లాక్​డౌన్​.. ఆంక్షల్లో లక్షల మంది

By

Published : Oct 23, 2020, 10:15 PM IST

బ్రిటన్​లో కరోనా వ్యాప్తి మరోమారు ఆందోళనకరంగా మారింది. కరోనా విజృంభణ నేపథ్యంలో కఠినమైన లాక్​డౌన్​ను అమలు చేస్తోంది బోరిస్​ ప్రభుత్వం. శుక్రవారం నుంచి వేల్స్​లో పూర్తిస్థాయి షట్​డౌన్​ పెట్టారు. దాదాపు 17 రోజులు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. గ్రేట్​ మాంచెస్టర్​, లివర్​పూల్​ సిటీ రీజియన్​, లాంక్​షైర్​ ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలు బంద్​ అయ్యాయి.

కరోనా విజృంభణకు చిహ్నంగా.. దక్షిణ యార్క్​షైర్​లో వైరస్​​ అలర్ట్​ వ్యవస్థలోని మూడోదశ నిబంధనలు అమలు చేస్తున్నారు. దాదాపు 70 లక్షల మంది ఈ ఆంక్షల కిందికి రానున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బార్లు, పబ్​లు​, రెస్టారెంట్లను మూసివేయాలని ఆదేశాలిచ్చారు అధికారులు. ఇళ్లల్లో నుంచి బయటకు రావడంపైనా నిషేధం విధించారు. స్కాట్లాండ్​లో టైర్​-5 అలర్ట్​ ప్రకటించారు.

యూకేలో గురువారం ఒక్కరోజే 21,242 కేసులు రాగా.. 189 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు 44వేల మంది కరోనా కారణంగా మరణించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details