తెలంగాణ

telangana

ETV Bharat / international

గజగజా వణుకుతూ.. మంచులో విహరిస్తూ.. - మాడ్రిడ్‌ సరిహద్దుల్లో మంచు కారణంగా ట్రాఫిక్​

స్పెయిన్​ రాజధాని మాడ్రిడ్​లో రికార్డు స్థాయిలో మంచు కురుస్తోంది. శ్వేతవర్ణంలోకి మారిన నగర అందాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు.. భారీ స్థాయిలో కురుస్తున్న మంచుతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. పచ్చని చెట్లన్నీతెలుపు రంగు శోభను సంతరించుకోగా.. రహదారులన్నీ మంచుతో నిండిపోయాయి. ఈ దృశ్యాలను మీరూ చూసేయండి మరి..!

spain madrid heavy snow fall
స్పెయిన్​లో భారీగా కురుస్తున్న మంచు..

By

Published : Jan 9, 2021, 7:36 PM IST

Updated : Jan 9, 2021, 10:58 PM IST

స్పెయిన్‌లో భారీగా మంచుకురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో అక్కడి ప్రాంతాలు శ్వేతవర్ణంలో దర్శనమిస్తున్నాయి. హిమపాతం కారణంగా అక్కడి ఇళ్లు, రోడ్లు, వాహనాలు మంచులో కూరుకుపోయాయి.

రికార్డు స్థాయిలో..

శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచు.. స్పెయిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అక్కడి చెట్లు, రోడ్లు, కార్లు సగం మేర మంచులో కూరుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ల లోతువరకూ మంచు పేరుకుపోయిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రికార్డు స్థాయి హిమపాతంతో అక్కడి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో మంచు తీవ్రత అధికంగా కనిపిస్తోంది.

స్పెయిన్​లో భారీగా కురుస్తున్న మంచు దృశ్యాలు

మంచును ఆస్వాదిస్తూ..

హిమపాతానికి అతిశీతల గాలులు తోడవటంతో ప్రజలు బయటకి రాలేని పరిస్థితి. పచ్చని చెట్లన్నీ ధవళవర్ణంలోకి మారిపోగా.. భవనాలపైనా భారీస్థాయిలో పేరుకుపోయిన మంచు పలువురిని ఆకర్షిస్తోంది.

కొన్ని చోట్ల మాత్రం.. స్థానికులు మంచులో స్కేటింగ్ చేస్తూ.. మంచుగడ్డలతో ఆడుకుంటూ కనిపించారు. మరోవైపు రహదారులపై 20 సెం.మీ. మేర మంచు పేరుకుపోవటంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో వాహనాలన్నీ మాడ్రిడ్‌ సరిహద్దుల్లోనే చిక్కుకుపోయాయి. రంగంలోకి దిగిన స్పెయిన్‌ సైనిక బలగాలు యుద్ధప్రాతిపదికన రోడ్లపై పేరుకుపోయిన హిమాన్ని తొలగిస్తున్నాయి.

మంచులో స్ట్రీట్​ నైట్​ వ్యూ..
మంచు గొడుగు కప్పుకున్న వృక్షాలు
మంచులో నిద్రిస్తున్న పార్కింగ్​లో ఉన్న సైకిళ్లు
మంచు దుప్పటి కప్పుకున్న విగ్రహం
మోడువారిన చెట్టుపై మంచు.. ఆకాశం వైపు ఆశగా చూస్తోంది కదూ!
మంచు వీధుల్లో నడిచేద్దామా.. హాయి హాయిగా..
మంచులో స్కేటింగ్​ భలే.. భలే..

ఇదీ చదవండి:ఇటలీలో అకస్మాత్తుగా ఏర్పడ్డ 66 అడుగుల గుంత

Last Updated : Jan 9, 2021, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details