పరారీలో ఉన్న భారత నగల వ్యాపారి మెహుల్ చోక్సీ కిడ్నాప్ ఉదంతంలో తన పాత్ర ఏమీ లేదని.. అతడి ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న బార్బరా జబరికా స్పష్టం చేసింది. చోక్సీ కిడ్నాప్ అయినట్లు చెబుతున్న ఆంటిగ్వాలోని జూలీ హార్బర్ ప్రాంతం చాలా సురక్షితమైనదిగా ఆమె చెప్పింది. జబరికా తనను వలలో ఇరికించి, కిడ్నాప్‌నకు సహకరించిందంటూ చోక్సీ తాజాగా చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. ఈ వ్యవహారంపై ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో ఆమె స్పందించింది.
"చోక్సీ కిడ్నాప్ అయినట్లు చేబుతున్న ఆంటిగ్వాలోని జూలీ హార్బర్ ప్రాంతం చాలా సురక్షితమైనది. అక్కడ ఎవరు అపహరణకు గురయ్యే అవకాశమే లేదు. ఇప్పటి వరకు చోక్సీ అసలు పేరు మీడియాలో వచ్చే వరకు నాకు తెలియదు. భారత్‌లో అతని పూర్వ చరిత్ర తనకు తెలియదు. తన పేరును అనవసరంగా చోక్సీ లాయర్లు, కుటుంబ సభ్యులు కిడ్నాప్ కేసులోకి లాగారు.
నేను చోక్సీ ప్రియురాలిని కాదని మరోసారి స్పష్టంగా చెబుతున్నా. అందరు అనుకుంటున్నట్టుగా ఆయన విలాసవంతమైన వస్తువులు ఇచ్చి నాతో డేటింగ్ చేయలేదు. ఇప్పటికీ చాలా మంది చోక్సీ ప్రియురాలిగా నా పేరు ప్రచారం చేస్తున్నారు. నా వ్యక్తిగత జీవితంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. నాకు సొంత ఆదాయం, వ్యాపారం ఉన్నాయి. అతని నగదు, హోటల్ బుకింగ్, నకిలీ ఆభరణాలు నాకు అవసరం లేదు.''
- బార్బరా జబరికా
క్యూబా పారిపోయేందుకు ప్లాన్..
చోక్సీ క్యూబా పారిపోయే ప్రణాళికను బహిర్గతం చేసింది ప్రియురాలు జబరికా. ' పారిపోవటం, అలాంటి ప్రణాళికను నాతో ఎప్పుడూ పంచుకోలేదు. అయితే.. ఎప్పుడైనా క్యూబా వెళ్లావా అని రెండుసార్లు అడిగాడు. తర్వాత క్యూబాలో కలుసుకుందామని చెప్పాడు. డొమినికా ఆయన తుది గమ్యం కాదు. నన్ను అడిగితే.. క్యూబానే అతని చివరి గమ్యస్థానం. ' అని పేర్కొంది జబరికా.
విమాన టికెట్లు ఇవ్వజూపాడు..