బ్రెజిల్‌కు చెందిన మాయా గబేరియా అనే యువతి సర్ఫింగ్‌లో తాను నెలకొల్పిన గిన్నిస్ రికార్డును తానే బద్దలు కొట్టింది. 73.5 అడుగుల అతిపెద్ద అలపై సర్ఫింగ్ చేయటం ద్వారా ఆమె ఈ ఘనత సాధించింది. అయితే.. ఇదివరకు ఉన్న 68 అడుగుల రికార్డు కూడా ఆమె నెలకొల్పిందే కావడం విశేషం.
'అల'వోకగా గిన్నిస్ రికార్డు బద్దలు - Surfing new Guinness records
సర్ఫింగ్‌లో తన రికార్డును తానే తిరగరాసింది బ్రెజిల్‌కు చెందిన ఓ యువతి. 73.5 అడుగుల భారీ అలపై సర్ఫింగ్ చేస్తూ ఔరా అనిపించేలా ఆమె చేసిన విన్యాసాలు చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లను ఫిదా చేస్తున్న ఈ వీడియో.. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
'అల'వోకగా గిన్నిస్ రికార్డు బద్దలు
మాయా సర్ఫింగ్‌కు సంబంధించిన 40 సెకెన్ల వీడియో నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. నాలుగంతస్తుల భవనం కంటే ఎత్తైన అలపై మాయా చేసిన సర్ఫింగ్ విన్యాసాలు వీడియోలో నిక్షిప్తమయ్యాయి. దీనిని చూసి "వావ్.. అద్భుతం.. కంగ్రాట్స్.. వాట్ ఎ థ్రిల్ మాయా..." అంటున్న వారి పొగడ్తలు సాగర ఘోషను మించిపోతున్నాయి. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి!
ఇదీ చదవండి:కదలకుండా 2 గంటలు.. రాత్రికి రాత్రి స్టార్