భారత స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన జలియన్‌వాలా బాగ్ హింసాకాండకు వందేళ్లు పూర్తవుతున్న తరుణంలో విచారం వ్యక్తం చేసింది బ్రిటన్. ఏప్రిల్ 13, 1919నాటి ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని థెరీసా మే ఆవేదన వ్యక్తం చేశారు.
కొంతమంది సభ్యులు వ్యతిరేకించడం వల్ల అధికారికంగా క్షమాపణ చెప్పడం ఆగిపోయింది. ఈ ఘటనపై ఇంతకుముందే బ్రిటన్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసిందని తెలిపారు మే.
ఘటన జరిగిందిలా...
అవిభాజ్య పంజాబ్ అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్‌లో జరిగిందీ దురాఘతం. స్వాతంత్ర పోరాటం కోసం భారతీయులు సమావేశం కాగా కల్నల్ రెజినాల్డ్ డయ్యర్ ఆదేశాల మేరకు కాల్పులకు తెగబడ్డాయి బ్రిటిష్ సేనలు. ఈ ఘటనలో 379మంది మృతి చెందారని, 1200మంది గాయపడినట్లు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అధికారిక లెక్కలు వేసింది.